Home

»

Latest News

కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్: అంతకు మించి మజా మొదలు 

Sep 5, 2026 5:23PM

 

 

కింగ్ నాగార్జున, కార్తీ ఊపిరి మూవీలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని ఫ్యాన్స్, ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాళ్ళందరి నుంచి మరోసారి ఆ హాయిని అందించాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వ్యక్తమవుతుంది. ఆ డిమాండ్ నెరవేరడానికి టైం పట్టవచ్చేమో గాని వాళ్ల హాయి విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ 


తెలుగు బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో 10వ సీజన్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 10 లాంచ్ ఎపిసోడ్‌కు సరికొత్త ఊపు తెస్తూ, కార్తీ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. బిగ్ బాస్ వేదికపై నాగార్జున, కార్తీ కలయిక అభిమానులకు కన్నుల పండుగగా మారింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో కార్తీ తన అప్ కమింగ్ మూవీ 'సర్దార్ 2' గురించి పంచుకున్న విశేషాలు మూవీపై  అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను పి.ఎస్. మిత్రన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. బిగ్ బాస్ 10 వంటి అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ ద్వారా 'సర్దార్ 2' తెలుగు ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా షురూ చేయడంతో, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి భారీ స్థాయిలో పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది.

 


Also Read: 9 ఏళ్ల వయసులో చేసిన భరతనాట్యం వీడియో వైరల్: ఇప్పటి మీ అభిమాన హీరోయిన్ 


గతంలో వచ్చిన 'సర్దార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ విజయంతో వచ్చిన సీక్వెల్ 'సర్దార్ 2' పై మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ సుమారు  100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. కార్తీ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలలో నటించి తన నటనతో అలరించబోతున్నారు. ఒకటి మాజీ రా ఏజెంట్ సర్దార్ పాత్ర కాగా, మరొకటి ఉత్సాహవంతుడైన పోలీస్ ఆఫీసర్ విజయ్ పాత్ర. విలన్‌గా ఎస్‌.జె. సూర్య నటిస్తుండగా, మాలవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంలగ్నమైన ఈ తారాగణంతో భారీ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 10 రిలీజ్ డేట్.

 

 

[Nagarjuna, Karthi, BiggBoss 10, Sardar 2 , Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com