Home

»

Latest News

9 ఏళ్ల వయసులో చేసిన భరతనాట్యం వీడియో వైరల్: ఇప్పటి మీ అభిమాన హీరోయిన్ 

Sep 5, 2026 4:54PM

 

భరత నాట్యం.. భరత మాత నుదిటిన ఉండే సిందూరంలో నుంచే భరత నాట్యం పుట్టిందని కళా శిఖామణులు చెప్తారు. వాళ్ళు చెప్పారని కాదు కానీ భరత నాట్యం చూస్తుంటే మన మనసులో ఉన్న సర్వరోగాలతో పాటు, మైండ్ లో ఉన్న చెడు ఆలోచనలు మాయమవుతాయి.  దైవత్వంతో కూడిన హావభావాలు సైతం భరత నాట్యంలో కనిపిస్తాయి. అందుకే చిన్న వయసు నుంచే భరత నాట్యం నేర్చుకుంటారు. ఈ కోవలోనే ఇప్పటి స్టార్ హీరోయిన్ తొమ్మిదేళ్ల వయసులో భరత నాట్యం ప్రదర్సన ఇచ్చి ఒక రేంజ్ లో రఫ్ఫాడించింది.


ఆమె ఎవరో కాదు ఇప్పుడు తన డాన్స్ లతో ఉర్రుతలూగిస్తున్న శ్రీలీల..కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తన చిన్ననాటి భరతనాట్యం వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కేవలం 9 సంవత్సరాల చిన్న వయసులోనే ఆమె స్టేజ్ పై చూపించిన అద్భుతమైన హావభావాలు, ముద్రలు, ఎంతో కష్టమైన నాట్య భంగిమలు, లయబద్ధమైన మూమెంట్స్ చూసి నెటిజన్లు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నాట్య ప్రదర్శన శ్రీలీల నాట్య ప్రావీణ్యాన్ని, చిన్ననాటి నుంచే ఆమెకున్న అంకితభావాన్ని స్పష్టంగా నిరూపిస్తోంది.

ఈ వైరల్ వీడియో వెనుక ఒక చిన్న సరదా కుటుంబ కథ దాగి ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీలీల తల్లిగారు వారి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఈ పాత నాట్య జ్ఞాపకాలను షేర్ చేశారట. ఆ వీడియోను చూసిన శ్రీలీలకు ఎంతో ముచ్చటేసి, "9 ఏళ్ల లీల నుంచి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు" అని క్యాప్షన్ జోడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. తల్లి వాట్సాప్ గ్రూప్‌ లో షేర్ చేసిన ఈ చిన్ననాటి తీపి జ్ఞాపకం, క్షణాల్లోనే నెట్టింట హల్‌చల్ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది.

 

 


Also Read: సూపర్ స్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే


చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, శ్రీలీల డ్యాన్స్ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆమె కేవలం 3 సంవత్సరాల వయసులోనే శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధనతో కేవలం 5 సంవత్సరాల వ్యవధిలోనే, అంటే తన 8 ఏళ్ల వయసులోనే తొలిసారిగా రంగస్థలంపై అరంగేట్రం చేసి లైవ్ ప్రదర్శన ఇచ్చారు. ఆ క్రమంలోనే 9 ఏళ్ల వయసులో చేసిన ఈ విశిష్టమైన భరతనాట్య ప్రదర్శన వీడియో ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక వీడియో చూసిన అభిమానులు, నెటిజెన్స్ పోటాపోటీగా స్పందిస్తూ' ఆ రకంగా చిన్న వయసు నుంచే డాన్స్ పట్ల అంకిత భావం ఉండబట్టే ఈజీ డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

[ Sreeleela , Bharatha Natyam, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com