
ఓటీటీలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై కూడా అదే స్థాయి విధ్వంసం సృష్టిస్తోంది. అభిమానుల కోరిక సెల్యులాయిడ్ పై అడుగుపెట్టి మొదటి రోజే ఊహించని రేంజ్ లో వసూళ్లు సాధించి, ట్రేడ్ విశ్లేషకులని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫస్ట్ డే అక్షరాలా 29.70 కోట్ల రూపాయల మార్కును తాకింది. (24.75 కోట్ల రూపాయల నెట్ ) దేశవ్యాప్తంగా దాదాపు 11,135 షోలలో ప్రదర్శితమవ్వగా, అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల సరసన నిలిచింది. హిందీ బెల్ట్ తో పాటు ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ వంటి మాస్ సెంటర్లలో 42.7 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయడం మిర్జాపూర్ క్రేజ్ కు నిదర్శనం. విశ్లేషకులు ముందుగా 18 నుంచి 20 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వస్తాయని అంచనా వేయగా, సినిమా మాత్రం వాటన్నింటినీ దాటుకుని 24.75 కోట్ల మార్కును అందుకుంది.

Also Read: కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్: అంతకు మించి మజా మొదలు
ఈ మూవీ హిందీ వెర్షన్ నుంచి దాదాపు 24.60 కోట్ల రూపాయల భారీ నెట్ వసూళ్లు రాగా, తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో కలిపి మిగతా భాగం నమోదైంది. బాక్సాఫీస్ రేసులో ఇటీవల వచ్చిన పలు క్రేజీ ప్రాజెక్టులను, ముఖ్యంగా 'అవారాపన్ 2' వంటి సినిమాల రికార్డులను కూడా 'మిర్జాపూర్: ది మూవీ' అధిగమించడం విశేషం. 2018 నాటి పాత కథాంశంతో, అప్పటి పాత్రల పునరాగమనంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తోంది. పంకజ్ త్రిపాఠి మరోసారి కాలీన్ భయ్యాగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, గుడ్డూ పండిత్‌గా అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేందు శర్మ నటన థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతోంది. వీరితో పాటు రవి కిషన్ ప్రవేశపెట్టిన 'బబ్బన్ యాదవ్' పాత్ర సినిమా కథను మలుపు తిప్పుతూ సరికొత్త వినోదాన్ని పంచుతోంది. జితేంద్ర కుమార్, రసిక దుగల్, అభిషేక్ బెనర్జీ వంటి నటీనటులు తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. వీకెండ్ ముగిసేసరికి మరిన్ని భారీ కలెక్షన్స్ వస్తాయనే అంచనాలు ఉన్నాయి.
[Mirzapur, Pankaj Tripathi, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






