
ప్రెజెంట్ వరల్డ్ వైడ్ థియేటర్స్ దగ్గర రామాయణ పార్ట్ 1 హవా కొనసాగుతూ ఉంది. రెండు రోజులకి రాబట్టిన 221 .05 కోట్ల గ్రాస్ నే రాముడు చూపిస్తున్న చిన్న ఉదాహరణ. ఇక ఈ చిత్రంలో సీతాదేవిగా సాయి పల్లవి అత్యద్భుతంగా జీవించింది. భారతీయ ఇతిహాసాల ప్రకారం సీతాదేవి రాముడి కంటే వయసులో చాలా చిన్నది.
ఈ మేరకే సీతాదేవిగా సాయి పల్లవిలో ఆ ఛాయలు ఉన్నాయని ఫిట్ అవుతుందని మేకర్స్ ఎన్నుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ముందూ, ఆ తర్వాత కూడా సీతాదేవిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ని సంప్రదించారని, కానీ ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆమెని వద్దని అనుకున్నారనే ప్రచారం జరిగింది.
ఈ వార్తలపై రీసెంట్ గా కరీనా కపూర్ స్పందించింది. రామాయణలో సీతాదేవి కోసం మేకర్స్ ఎప్పుడూ తనని సంప్రదించలేదని, అసలు ఈ ప్రాజెక్ట్ గురించి తనతో ఎలాంటి చర్చలు కూడా జరగలేదని స్పష్టం చేశారు. తద్వారా రెట్టింపు పారితోషికం డిమాండ్ చేసినందుకే కరీనా కపూర్‌ని తొలగించారన్న వదంతులలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

కాకపోతే కన్నడ బ్యూటీ ' శ్రీనిధి శెట్టి సైతం సీతాదేవి కోసం ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ, వివిధ కారణాల వల్ల దర్శక నిర్మాతలు ఆమెను ఎంపిక చేయలేదనేది మాత్రం నిజం.
ఇది కూడా చదవండి: రామాయణ రెమ్యునరేషన్ 6 కోట్లు ఆ పిల్లలకి ఇచ్చేసిన వివేక్ ఒబెరాయ్
రెండు భాగాలకు కలిపి సాయి పల్లవి దాదాపు .12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు (అంటే ఒక్కో భాగానికి సుమారు రూ. 6 కోట్లు) ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి మేకప్ లేకుండా తన సహజ సిద్ధమైన నటనతో సాయి పల్లవి సీతాదేవిగా పూర్తి న్యాయం చేశారని, వెండితెరపై ఆమె రూపం దైవిక తేజస్సుని తలపించిందని తొలి ఆట నుంచే ప్రేక్షకులు, సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: రామాయణ హైలెట్స్ ఇవే
మీకు నచ్చవచ్చు: రామాయణ రివ్యూ
[Kareena Kapoor About Ramayana Sita Role, Kareena Kapoor Rejected Sita Role In Ramayana, Ramayana movie, Sai Pallavi, Kareena Kapoor, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]





