Home

»

Latest News

రామాయణ రెమ్యునరేషన్ 6 కోట్లు ఆ పిల్లలకి ఇచ్చేసిన వివేక్ ఒబెరాయ్: సర్వత్రా ప్రశంసలు!

Nov 7, 2026 11:24AM


ఇండియన్ చిత్ర పరిశ్రమకి దొరికిన అరుదైన నటుల్లో వివేక్ ఒబెరాయ్ ఒకరు. బాలీవుడ్ కి చెందిన ఈ నట శిఖరం రక్తచరిత్ర పార్ట్ 1 , పార్ట్ 2 ద్వారా తెలుగు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ప్రస్తుతం రామాయణలో రావణుడి మిత్రుడు, రావణుడి సోదరి శూర్పణఖ మనసు పడే మొదటి ఇష్టసఖి 'విద్యుత్ జీవుడు' గా మెప్పించాడు. 


కాకపోతే ఎడిటింగ్ లో విద్యుత్ జీవుడి  సీన్స్ చాలా వరకు కట్ అయ్యాయనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క సీన్ లో ఆ క్యారక్టర్ వస్తుంది. తాజాగా వివేక్  ఒబెరాయ్  తమ గొప్ప మనసుతో ఆదర్శంగా నిలిచాడు.రామాయణ ద్వారా అందుకున్న 6 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ ని క్యాన్సర్‌తో పోరాడుతున్న నిరుపేద చిన్నపిల్లల వైద్య చికిత్స కోసం నేరుగా విరాళంగా ఇచ్చాడు.

ఈ మేరకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాను స్వయంగా కలిసి, ఆ మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్థం కేటాయించాలని కోరారు. 

కేవలం సినిమా రెమ్యునరేషన్‌ను వదులుకోవడంతో ఆగకుండా, తన జీవితంలో అత్యంత మైలురాయి అయిన 50వ పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న 50 మంది పేద చిన్నారుల పూర్తి వైద్య ఖర్చులను తానే  స్వయంగా భరిస్తున్నట్లు ప్రకటించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇది కూడా చదవండి : మహాశక్తి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే: దటీజ్ నయనతార!

తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజును ఇలాంటి గొప్ప సామాజిక సేవకు వినియోగించడం ద్వారా ఆయన ఎన్నో నిరుపేద కుటుంబాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు. ఈ అద్భుతమైన ఉదారతా గుణం గురించి తెలుసుకున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వివేక్ ఒబెరాయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రియల్ హీరోలు ఉండటం అరుదు అని, ఆయన చూపిన చొరవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని కామెంట్లు చేస్తున్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

మీకు నచ్చవచ్చు :ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఈ హీరోనే!
మీకు నచ్చవచ్చు :రామాయణ మూవీ రివ్యూ!

 

[Vivek Oberoi Ramayana Remuneration Donation, Vivek Oberoi, Ramayana movie, Vivek Oberoi donation, cancer children treatment, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com