Home

»

Latest News

Ramayana: ఆ స్టార్ హీరోయిన్‌కి షాక్..ఆమె క్యారక్టర్ ని ఎడిటింగ్‌లో లేపేశారా?

Oct 24, 2026 2:24PM


ఎడిటింగ్.. ఈ పదం విన్నప్పుడల్లా నటీనటుల్లో కాస్త భయం మొదలవుతుంది. తాము కష్టపడి చేసిన సీన్స్ తో ఏమైనా లేస్తాయా? లేక మనల్నే లేపుతారా అని? ఇప్పుడు ఈ భయం రామాయణ ద్వారా ఒక స్టార్ హీరోయిన్ అభిమానులని వెంటాడుతుంది. 


టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..  లంకాధిపతి రావణుడి భార్య మండోదరి క్యారక్టర్ లో కాజల్ అగర్వాల్ కనిపిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారమే కాదు నిజం కూడా అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే యష్ లాంటి కట్ అవుట్ కి మరో స్టార్ సింబల్ కట్ అవుట్ అవసరం కూడా. అయితే మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికపై సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్రితం తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది. రావణుడి భార్యగా అంతటి అందమైన కాజల్ అగర్వాల్ ఇంట్లో ఉంటే, ఆయన సీత పాత్రలో ఉన్న సాయి పల్లవి కోసం ఎందుకు తహతహలాడతాడంటూ నెటిజన్లు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.   ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందనే ఆందోళనతోనే మేకర్స్ కాజల్ అగర్వాల్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే లేదా ఆమె నటించిన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించారనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది. చిత్ర యూనిట్ నిర్వహించిన పలు ప్రతిష్టాత్మక ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనూ, గ్లోబల్ క్యాంపెయిన్స్‌లోనూ కాజల్ అగర్వాల్ ఎక్కడా కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. సినిమాలోని ఇతర ప్రముఖ నటీమణులు ప్రమోషన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నప్పటికీ, కాజల్ మాత్రం పూర్తిగా దూరంగా ఉండటం ప్రేక్షకుల్లో అనేక సందేహాలను లేవనెత్తుతోంది.   

ఇది కూడా చదవండి: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ పై పరుచూరి వ్యాఖ్యలు వైరల్: ఆ ఎపిసోడ్ అవసరమా!

 

 

ఏది ఏమైనా రామాయణలో కాజల్ అగర్వాల్ ఉందా! ఉంటే ఎడిటింగ్‌లో కట్ చేసారా అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. నిజం అనేది రావడం లేటు అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా.

 

[Kajal Aggarwal Removed From Ramayana, Ramayana movie, Kajal Aggarwal Ramayana, Mandodari role removed, Ranbir Kapoor Ramayana, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com