
సినిమా డైరెక్టర్...సినిమా మొత్తం ముందుగానే తన మెదడులో కొలువుతీరి ఉంటుంది. అంటే మొదటి వీక్షకుడు. కాబట్టి వీక్షకుడి హోదాలో తను మంచి సినిమా అందిస్తే సినిమాతో పాటు ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఎన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. ఎంత మంది కొత్త దర్శకులు వస్తున్నారు అంటే మాత్రం మరి.. అది.. అని నములుతూ ఏ సమాధానం చెప్పాలో అని ఆల్ ప్రేక్షకులు, ఆల్ మేకర్స్ ఆలోచించే పరిస్థితి.
ఒకప్పుడు ప్రతి పది మంది కొత్త దర్శకుల్లో కనీసం 9 మంది బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్టర్లుగా మారేవారు. కానీ ఈరోజుల్లో ఎంతోమంది కొత్త దర్శకులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పటికీ, పరిశ్రమను నిలబెట్టే విజయానుభవాలు మాత్రం వేళ్లమీద లెక్కించదగిన స్థాయికి పడిపోయాయి. అసలు టాలీవుడ్‌లో ఈ మార్పు ఎందుకు వచ్చింది?ఒకప్పటి హిట్ల వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? నేటి రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర వరుస ఫ్లాప్‌లు ఎందుకు నమోదవుతున్నాయి? దీనికి వెనుక ఉన్న విశ్లేషణను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఎన్నో చేదు నిజాలు బయటపడతాయి.
గతంలో సినిమా నిర్మించడం అంటే అదొక వ్యాపారం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కళారాధన. ఆ రోజుల్లో నిర్మాతలు సినిమాని ప్రాణంగా ప్రేమించేవారు. కథలోని ప్రాణాన్ని, లోతును పసిగట్టే నేర్పరితనం వారిలో ఉండేది. ఎవరి వద్ద నిజమైన ప్రతిభ ఉందో, ఏ కథ ప్రేక్షకుడి హృదయానికి తాకుతుందో గుర్తించడంలో నాటి నిర్మాతలు సిద్ధహస్తులు. అందుకే ప్రతిభ ఉన్న కుర్రాడు కనిపించగానే ధైర్యంగా అవకాశాలు ఇచ్చేవారు. వారి నమ్మకం, కథపై ఉన్న పట్టు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని 90 శాతం వరకు ఖాయం చేసేవి. కథే కథానాయకుడిగా సాగిన ఆ రోజుల్లో పది మంది కొత్త వారిలో తొమ్మిది మంది విజేతలుగా నిలవడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.
కానీ కాలక్రమేణా టాలీవుడ్ నిర్మాణ రంగంలో ఊహించని మార్పులు వచ్చాయి. సినిమాపై సరైన అవగాహన, ప్రేమ ఉన్న నిర్మాతల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. వారి స్థానంలోకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర రంగాలకి చెందిన వ్యాపారవేత్తలు భారీగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కేవలం నల్లధనాన్ని మార్చుకోవడానికో లేదా గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు కోసమో వచ్చే వారికి కథలోని గుండెచప్పుడు అర్థం కావడం లేదు. ఎవరిలో అసలైన టాలెంట్ ఉంది, ఎవరి కథలో దమ్ము ఉందో పసిగట్టే నైపుణ్యం లేకపోవడంతో, పరిశ్రమలో నిజమైన ప్రతిభ మూలనపడిపోతోంది.
ఇది కూడా చదవండి: Ramayana:ఆ స్టార్ హీరోయిన్ కి షాక్..ఆమె క్యారక్టర్ ని ఎడిటింగ్ లో లేపేసారా!
.webp)
దీని పరిణామంగా ఈ రోజుల్లో నిజమైన సృజనాత్మకత ఉన్న దర్శకుల కంటే, కేవలం కల్లబొల్లి మాటలతో షో చేసేవారు, హడావుడి చేసేవారే త్వరగా దర్శకులుగా మారిపోతున్నారు. వారు చెప్పే కథలో ఏమీ లేకపోయినా బిల్డప్‌లతో, పిచ్ డెక్‌లతో ప్రెజెంటేషన్ ఇస్తుంటే వ్యాపార నిర్మాతలు పడిపోవడమే అందుకు కారణం.ఫలితంగా థియేటర్లలో ఏమాత్రం సత్తా లేని కథలతో సినిమాలు వస్తున్నాయి. ఇదే నిజం. ఈ నిజం మారకపోతే ప్రేక్షకుడు తెలుగు సినిమాని తక్కువ చేసి మాట్లాడటాన్ని మరింతగా అలవాటు చేసుకుంటాడు.
[Tollywood Directors Hit Ratio Analysis, tollywood directors hit ratio, telugu cinema analysis, real estate film producers, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






