
రైటర్ కి విజిల్స్ తో కూడిన స్టార్ స్టేటస్ ని అందించి లెజండ్రీ హోదాలో స్థిరపడ్డారు పరుచూరి గోపాల కృష్ణ. పరుచూరి పలుకులు ద్వారా పలు సినిమాలపై విశ్లేషణ చేసి సినీ ఆశావహులకి సినీ ద్రోణాచార్యుడుగా ఉన్నారు. ఈ కోవలోనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' పై చెప్పిన మాటలు వైరల్ గా నిలిచాయి.
ఆయన మాట్లాడుతు సినిమా చాలా అద్భుతంగా ఉందని, కుటుంబ విలువలను, సరోగసి వంటి విభిన్నమైన సామాజిక కోణాన్ని ఎంచుకున్న విధానం ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అయితే, సినిమాలో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా ద్వితీయార్ధంలో సూర్య తన తండ్రి రెండో భార్య పెళ్లి జరిపించే ఎపిసోడ్ అనవసరం. తమిళ ప్రేక్షకులకి నచ్చుతుందేమో గాని తెలుగు వాళ్ళకి నచ్చదు. ఆ ఎపిసోడ్ ని మరింత క్రిస్ప్‌గా కట్ చేసి ఉంటే సినిమా ఇంకా చాలా వేగంగా, పదునుగా సాగేదని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆ నిర్దిష్ట ఎపిసోడ్ లేకపోతే సినిమా రన్ టైమ్ తగ్గడంతో పాటు ప్రేక్షకుడికి మరింత ఎంగేజింగ్‌గా ఉండేదని ఆయన తన విశ్లేషణలో స్పష్టం చేశారు.అయినప్పటికీ, సినిమా సాధించిన అఖండ విజయాన్ని, నటీనటుల అంకితభావాన్ని ఆయన ఎంతో అభినందించారు. ముఖ్యంగా హీరో సూర్య తన వయసుకు తగినట్లుగా ఒక పరిణతి చెందిన పాత్రను ఎంచుకుని, ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు అద్భుతమని మెచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: ధనుష్ పై విజయ్ పార్టీ సంచలన వ్యాఖ్యలు: అసలు ఆట మొదలయ్యిందా!

హీరోయిన్ మమితా బైజు తన అల్లరితో, చక్కటి నటనతో సినిమాకు ప్రాణం పోసిందని ప్రశంసించారు. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తల్లి పాత్రలో జీవించిన విధానం ప్రేక్షకులను కంటతడి పెట్టించిందని అన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మధురమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయని, విజువల్స్ పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించారని తెలిపారు.
[Paruchuri About Viswanath And Sons, Viswanath and Sons, Paruchuri Gopala Krishna, Suriya movie, Venky Atluri, Viswanath and Sons box office, Mamitha Baiju, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






