
ఉత్తరాంధ్ర లెజండ్రీ బుర్రకథ, జానపద కళాకారిణి 'గరివిడి లక్ష్మి'. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్ల ప్రయాణంలో ఏకంగా 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి రికార్డు సృష్టించింది. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'గరివిడి లక్ష్మి'.
అచ్చ తెలుగు హీరోయిన్ వరంగల్ అమ్మాయి ఆనంది హీరోయిన్. నిజమైన గరివిడి లక్ష్మిగా ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసి తన సినీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలబడిపోయేలా చేసింది.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నవంబర్ 13 నుండి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. మరి థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, కుటుంబ సమేతంగా ఇంట్లోనే ఈ సరికొత్త దృశ్యకావ్యాన్ని చూసేయవచ్చు.

ఇది కూడా చదవండి: ధురంధర్, పుష్ప 2 , కల్కి రికార్డ్స్ అవుట్!
థియేటర్స్ లో అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. పెద్ద హీరోల సినిమాల పోటీని సైతం తట్టుకుని నిలబడి కలెక్షన్ల పరంగా ఏకంగా 9.03 కోట్ల ఇండియా నెట్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఆ కాలంలో మహిళా కళాకారులు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు మరియు సామాజిక వివక్షను దర్శకుడు గౌరి నాయుడు జమ్ము హృద్యంగా తెరకెక్కించారు.

ఉత్తరాంధ్ర పల్లెటూరి వాతావరణం, యాస మరియు బాష ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేశాయి. 2 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ బయోపిక్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించారు. రిలీజ్ డేట్ విషయంలో కొంచం ఆగి ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేది.
మీకు నచ్చవచ్చు: సాయి ధరమ్ తేజ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!
మీకు నచ్చవచ్చు: గబ్బర్ సింగ్ పై శృతి హాసన్ కామెంట్స్!
[Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News, Garividi Lakshmi Ott Date, Garividi Lakshmi OTT, Anandhi Garividi Lakshmi movie, Amazon Prime Video streaming, Garividi Lakshmi release date,Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]






