
వరల్డ్ సెల్యులాయిడ్ వద్ద రామాయణ దూసుకుపోతూ ఉంది. కలెక్షన్స్ లాస్ట్ ఫిగర్ ఊహకి కూడా అందదనే మాటలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే 1483 కోట్లు. రీసెంట్ గా స్టార్ రైటర్ జావేద్ అక్తర్ రామాయణ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఏ భారతీయుడైనా సరే మతాలకు అతీతంగా రాముడిని తన రక్తంలో కలిగి ఉంటాడని సంచలన ప్రకటన చేశారు. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయనొక గొప్ప భావజాలం, నైతికతకి ప్రతీక, జీవన విధానం అని ఆయన అభివర్ణించారు. తన ఈ వ్యాఖ్యల వల్ల కొందరు వ్యక్తులు తనపై కోపగించుకోవచ్చని ముందే స్పష్టం చేసినప్పటికీ, రాముడి ప్రాముఖ్యత మత సరిహద్దులని దాటి ప్రతి ఒక్కరి హృదయాలని హత్తుకుంటుందని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జావేద్ అక్తర్, షారుఖ్ ఖాన్ నటించిన 'స్వదేస్' చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 'పల్ పల్ హై భారీ' పాటని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకి తాను రాసిన "మన్ సే రావణ్ జో నికాలే, రామ్ ఉస్కే మన్ మే హై" అనే పంక్తులు ప్రజల మనసులను ఎలా గెలుచుకున్నాయో వివరించారు.

రాముడిని మనం కొన్నిసార్లు ఒక వ్యక్తిగా పరిమితం చేసినప్పటికీ, ఆయన ఆకృతికి మించి చాలా విశలుడైనవాడని, మన సంస్కృతిలో ఆయన ఒక జీవన విధానంగా నిలిచిపోయాడని ఆయన పేర్కొన్నారు. ఇక రామాయణని ఇంకా చూడలేదని, అయితే తన కూతురు జోయా అక్తర్ మాత్రం ఆ చిత్రాన్ని చూసి ఎంతో అభినందించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి:హైదరాబాద్ లో ప్రాపర్టీ అమ్మేసిన అనుష్క!
అయితే జావేద్ అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాహిద్ రషీద్ ఈ వ్యాఖ్యలని తీవ్రంగా తప్పుబట్టారు. జావేద్ అక్తర్ ఒక వ్యాపారవేత్త అని, బాలీవుడ్‌లో పాటలు అమ్ముకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, తాను నాస్తికుడినని చెప్పుకునే జావేద్ అక్తర్ ఇప్పుడు రాముడిపై ఇంతటి విశ్వాసం చూపడం ఏంటని ప్రశ్నిస్తూ, ఆయన తన పేరును 'జావేద్ అక్తర్' నుండి 'రామ్‌పాల్' గా మార్చుకోవాలని వ్యంగ్యంగా సలహా ఇవ్వడం గమనార్హం.

ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో, కళాకారుల అభిప్రాయాలు, మతం మరియు రాజకీయాలకు సంబంధించిన సరిహద్దులపై మరోసారి పెద్ద ఎత్తున వాదనలు మొదలయ్యాయి.ఇక జావేద్ అక్తర్ సినీ జర్నీని చూసుకుంటే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలకి రచయితగా పని చేసాడు. అద్భుతమైన సాంగ్స్ కూడా అందించాడు. అందిస్తూ వస్తున్నాడు.
మీకు నచ్చవచ్చు:చిరంజీవితో మూవీపై రోజా రియాక్షన్!
మీకు నచ్చవచ్చు:చరిత్ర సృష్టించిన మయసభ!
[Javed Akhtar, Ram Controversy, Maulana Sajid Rashidi, Tollywood]





