Home

»

Latest News

చరిత్ర సృష్టించిన మయసభ: IFFI నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్!

Nov 18, 2026 11:45AM


తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సోనీలివ్ (SonyLIV) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ప్రతిష్ఠాత్మక పొలిటికల్ డ్రామా ‘మయసభ’ (Mayasabha) సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. గోవా వేదికగా జరగనున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ వెబ్ సిరీస్ (OTT) అవార్డు విభాగంలో ఈ సిరీస్ నామినేషన్ దక్కించుకుంది.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా 2023లో ఈ ఓటీటీ అవార్డు కేటగిరీని ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఇప్పటివరకు ఈ విభాగంలో నామినేషన్ సాధించిన మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ రికార్డులకెక్కడం విశేషం. ఈ జాతీయ గుర్తింపు ద్వారా తెలుగు కథాబలం మరియు ప్రాంతీయ మూలాలున్న సృజనాత్మకత దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటోంది.

ప్రముఖ దదర్శకుడు దేవా కట్టా ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు దేవా కట్టా  కిరణ్ జయ్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. హిట్‌మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 1970ల మధ్యకాలం నుంచి వచ్చిన సామాజిక, రాజకీయ మార్పులను నేపథ్యంగా తీసుకుని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆ కాలంలోని రాజకీయ సమీకరణాలు, స్నేహాలు, ప్రత్యర్థిత్వాలు మరియు అధికార పీఠం కోసం జరిగే ఆధిపత్య పోరాటాలను అత్యంత వాస్తవికంగా ఇందులో కళ్లకు కట్టారు.

ఇది కూడా చదవండి: ధోనీ గురించి బాలయ్య ఏమన్నారంటే? వైరల్ అవుతున్న వీడియో!

ఈ పొలిటికల్ థ్రిల్లర్ కథలో భాగంగా, ఆదర్శ భావాలున్న యువ విద్యార్థి నాయకుడు కకర్ల కృష్ణమ నాయుడు (KKN) మరియు ప్రభావవంతమైన కుటుంబం నుంచి వచ్చిన ఎం.ఎస్. రామిరెడ్డి (MSR) ప్రయాణం ప్రధానంగా సాగుతుంది. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒకే ఆశయంతో స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం, కాలక్రమేణా సిద్ధాంతాలు, కుల సమీకరణాలు, డబ్బు, సంస్థాగత అధికారం, వ్యక్తిగత మహారాజా ఆశయాల కారణంగా ఎలా మలుపు తిరిగిందనే ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది. కేవలం అధికారం కోసం జరిగే పోరులా కాకుండా, రాజకీయ నమ్మకాలు, వ్యక్తిగత బంధాలు మరియు మానవ సంబంధాల మధ్య ఉండే పలుచని రేఖను ఈ సిరీస్ అద్భుతంగా ఆవిష్కరించింది.

 

 ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, తాన్య రవిచంద్రన్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. నటీనటుల బలమైన ప్రతిభ, అత్యుత్తమ సాంకేతిక విలువలు మరియు దేవా కట్టా టేకింగ్ ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నవంబర్ 20 నుండి 28 వరకు జరిగే ఈ IFFI వేడుకల్లో ఉత్తమ వెబ్ సిరీస్‌గా నిలిచే ప్రాజెక్ట్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతితో పాటు ప్రతిష్టాత్మక ప్రశంసాపత్రం అందజేయనున్నారు. ఈ నామినేషన్ దక్కడం ద్వారా తెలుగు వెబ్ కంటెంట్ జాతీయ స్థాయిలో తన సత్తా చాటడమే కాకుండా, భవిష్యత్ డిజిటల్ మేకర్స్‌కు నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది.

 

మీకు నచ్చవచ్చు:సాయి పల్లవి పేరు ఆ డైరెక్టర్ ఏమని ఫీడ్ చేసుకున్నాడో తెలుసా!
మీకు నచ్చవచ్చు:రామాయణ కలెక్షన్స్ ఇవే!

 

[Mayasabha, IFFI, aadi pinisetty, tollywood]

    
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com