Home

»

Latest News

హైదరాబాద్ లో ప్రాపర్టీ అమ్మేసిన అనుష్క!

Nov 18, 2026 1:50PM

బొమ్మాళి, స్వీటీ అనుష్క శెట్టిని కొన్ని గంటలుగా సోషల్ మీడియా రౌండ్ అప్ చేసింది.  అనుష్క హైదరాబాద్‌లోని తన ఖరీదైన ఆస్తిని అమ్మేశారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉన్న ఆమె ఇల్లు లేదా ప్రాపర్టీని విక్రయించేశారనే వార్తలు ఒక్కసారిగా టాలీవుడ్‌లో కలకలం రేపాయి.

అనుష్క గురించి ఇలాంటి రూమర్లు రావడం అభిమానులకి  ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.అనుష్క శెట్టి ఆస్తుల విషయానికి వస్తే, ఆమె కేవలం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మాత్రమే కాకుండా, నగరానికి శివార్లలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌ని సైతం కలిగి ఉంది.

ఆమె నివాసాలు ఎప్పుడూ కూడా ప్రకృతికి దగ్గరగా, అత్యంత నిరాడంబరంగా మరియు ప్రశాంతమైన జీవనశైలిని ప్రతిబింబించేలా ఉంటాయి.ఇది కేవలం సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక పుకారు మాత్రమేనని, ఆమె తన ఆస్తుల విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

ఇది కూడా చదవండి:చిరంజీవితో మూవీ అనగానే రోజా రియాక్షన్: రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ, రకరకాల కులాలు ఉండవు!

 

ఏది ఏమైనప్పటికీ, అధికారికంగా ఎలాంటి స్పష్టత వచ్చే వరకు ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్న అనుష్క నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీ ఘాటీ.

 

 

మీకు నచ్చవచ్చు:అయ్యప్ప దీక్ష తీసుకున్న ఇరుముడి మేకర్స్!
మీకు నచ్చవచ్చు: ధోని పై బాలయ్య కామెంట్స్ వైరల్!

 

[Anushka, Ghaati, anushka jubilee hills house, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com