Home

»

Latest News

jana nayagan: జననాయగన్ సెన్సార్ టాక్ అవుట్.. ఎంత పని చేసారంట!

Jul 22, 2026 3:42PM

 

ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న జన నాయగన్(తెలుగు జన నాయకుడు) మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. దీంతో అభిమానులు, సినీ ప్రియుల ముఖాలు మతాబులులా వెలిగిపోతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెన్సార్ రిపోర్ట్ వాళ్ళ వెలుగుల్ని రెట్టింపు చేస్తుందని చెప్పవచ్చు. 


సెన్సార్ రిపోర్ట్ ప్రకారం' ఫస్ట్ హాఫ్‌లో విజయ్ క్యారెక్టరైజేషన్, ఆయన స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు అభిమానులని, ప్రేక్షకులని  కట్టిపడేస్తాయని, సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ పొలిటికల్ డ్రామా, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నడుస్తుందని సెన్సార్ కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు 30 నిమిషాల పాటు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారట.

విజయ్ నటన, ఆయన చెప్పే శక్తివంతమైన డైలాగ్స్ సామాన్య ప్రజల ఆలోచనలని  తట్టేలా ఉంటాయని సమాచారం. వర్తమాన సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, విజయ్ తనదైన శైలిలో ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ అభిమానులకు ఐఫీస్ట్‌లా మారనున్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, పూజా హెగ్డే గ్లామర్, బాబీ డియోల్ విలనిజం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. అంతేకాకుండా, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాలోని ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు సమాచారం. 'U/A' సర్టిఫికేట్‌ ని కేటాయించగా  రన్‌టైమ్ సుమారు 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు) గా లాక్ అయినట్లు తెలుస్తోంది. సెన్సార్ టాక్ బయటకు రావడంతో దళపతి అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. బాక్సాఫీస్ వద్ద  1000 కోట్లు సాధిస్తామని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Also read: అందులో మొత్తం 60 సినిమాలు ఉన్నాయి.. చూసి ఎంజాయ్ చేయండి

jana nayagan, vijay, pooja hegde, h vinoth

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com