
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం.. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.541 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. దీంతో తమిళ సినిమా బాక్సాఫీస్ రికార్డుల జాబితాలోనూ ఈ సినిమా కీలక స్థానానికి చేరుకుంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆరో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది.
అందుబాటులో ఉన్న బాక్సాఫీస్ నివేదికల ప్రకారం, ఆరో రోజు ఇండియాలో ఈ సినిమా సుమారు రూ.45.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇందులో తమిళ వెర్షన్ నుంచి రూ.31.20 కోట్లు, తెలుగు వెర్షన్ నుంచి రూ.8.75 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు అంచనా. దసరా సెలవు కూడా వసూళ్లకు కలిసొచ్చింది.
జైలర్ 2 ఓపెనింగ్ కూడా భారీ స్థాయిలో నమోదైంది. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.418.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత కూడా వసూళ్ల వేగం కొనసాగడంతో ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటింది.
ఇండియాలో ఈ మూవీ రూ.337 కోట్ల గ్రాస్, రూ.287.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.541 కోట్లకు చేరింది.

రూ.500 కోట్ల మార్కును దాటడంతో జైలర్ 2 ముందు ఇప్పుడు మరిన్ని రికార్డుల లక్ష్యాలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో 2.0, జైలర్, లియో టాప్-3 లో ఉండగా.. ప్రస్తుతం జైలర్ 2 నాలుగో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే టాప్-2 లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
‘జైలర్ 2’ 500 కోట్ల క్లబ్‌లో చేరడంతో రజినీకాంత్ మరో ఫీట్ సాధించారు. కోలీవుడ్ హిస్టరీలో ఇప్పటిదాకా 500 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు ఆరు ఉండగా.. అందులో నాలుగు రజినీ సినిమాలే కావడం విశేషం. గతంలో 2.0, జైలర్, కూలీ సినిమాలతో ఈ ఫీట్ సాధించిన సూపర్‌స్టార్.. ఇప్పుడు ‘జైలర్ 2’తో నాలుగోసారి తన స్టార్ పవర్ చూపించారు.
ఇది కూడా చదవండి: బంపరాఫర్.. బుచ్చిబాబు నెక్ట్స్ సినిమా ఆ స్టార్ హీరోతోనేనా.?
[Jailer 2 Box Office Collection, Jailer 2 Worldwide Collection, Jailer 2 Day 6 Collection, Jailer 2 500 Crore, Jailer 2 Telugu Collection, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh, Telugu Film News]






