
హీరో కట్ అవుట్ కి ఏ మాత్రం తీసిపోకుండా మూడుదశాబ్దాలపై నుంచి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ తో దూసుకుపోతున్న తార.. నయనతార.. హిట్ మాత్రమే తన కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మార్చుకొని ఇప్పుడు టైటిల్ రోల్ లో 'మహాశక్తి' తో సెల్యులాయిడ్ ని తన వశం చెయ్యడానికి రెడీ గా ముస్తాబవుతోంది. తమిళ టైటిల్ మూకుతి అమ్మన్ పార్ట్ 2 . తాజాగా 'మహాశక్తి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
రెండు నిమిషాల ఇరవై నాలుగు నిమిషాల నిడివితో విడుదలైన ట్రైలర్, అలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూస్ నా చిరునామా అంటూ దూసుకుపోతూ ఉంది. ట్రైలర్ విషయానికి వస్తే, ప్రారంభం నుంచే గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సాగుతు అమ్మవారి దివ్యమైన రూపంలో నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
దీంతో భక్తులను రక్షించే దైవిక శక్టర్‌గా ఆమె అభినయం ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం డివోషనల్ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా, సరికొత్త మిస్టరీ మరియు అద్భుతమైన ఫాంటసీ హంగులతో ఈ చిత్రాన్ని మలిచారు. ముఖ్యంగా ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా అత్యంత శక్తివంతమైన మంత్రగత్తె పాత్రలో నటిస్తుండగా, ఆమె లుక్స్ మరియు మేకోవర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నయనతార, రెజీనాల మధ్య వచ్చే శక్తిమంతమైన పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. వీరితో పాటు కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన యోగిబాబు మరియు ప్రముఖ నటి ఊర్వశి తమదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే కథలో కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రణబాలి 2 కథ లీక్: ఇది ఆ దర్శకుడి పనేనా!
ప్రముఖ దర్శకుడు సుందర్. సి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై డా. ఇషారి కె. గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దీనిని కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నవంబర్ 6, న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. హిట్ బొమ్మ 'మూకుతి అమ్మన్' కి సీక్వెల్ అనే విషయం తెలిసిందే.
[Nayanthara Mahasakthi Trailer, Mahasakthi movie, Nayanthara Mahasakthi, Mookuthi Amman 2, Sundar C direction, Regina Cassandra, Mahasakthi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






