
దర్శకుడు బుచ్చిబాబు సానా తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? పెద్ది తర్వాత ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఇప్పుడు టాలీవుడ్లో ఈ విషయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో బుచ్చిబాబు సినిమా ఉంటుందనే ప్రచారం ఒకవైపు నడుస్తుండగా.. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్యతో ఆయన ఓ యాక్షన్ డ్రామా చేయనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు.. ఈ ఏడాది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన పెద్ది సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో పనిచేస్తారనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఈ క్రమంలో బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ వినిపించారని, ఆ కథ ఆయనకు నచ్చిందని గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సమయం పట్టవచ్చని టాక్. ఈలోగా మరో కథతో సినిమా ప్రారంభించాలని బుచ్చిబాబు ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా ప్రచారం ప్రకారం.. బుచ్చిబాబు తమిళ హీరో సూర్యకు ఓ కథ వినిపించినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిగా భిన్నమైన కథాంశంతో, పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని వినికిడి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.
చిరంజీవి, సూర్యలకు బుచ్చిబాబు చెప్పిన కథలు రెండూ వేరని తెలుస్తోంది. చిరంజీవి మూవీ ఆలస్యమైతే ముందుగా సూర్య సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అంటున్నారు. దీంతో బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ చిరంజీవితో ఉంటుందా? లేక సూర్యతోనా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: 175 డేస్ రికార్డు.. టాలీవుడ్లో చరిత్ర సృష్టించిన టాప్10 సినిమాలు ఇవే.!
[Buchi Babu Sana Next Movie, Suriya Buchi Babu Movie, Chiranjeevi Buchi Babu Movie, Peddi Director, Buchi Babu Sana, Chiranjeevi, Suriya, Telugu Film News]




