
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు'. ఆగష్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నవ్వుల వర్షం కురిపిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.
గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతో కసితో కష్టపడ్డారు. ఆ కష్టానికి, నిరీక్షణకు దక్కిన ఫలితం ఈ 50 కోట్ల క్లబ్.
కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి 'కొరియన్ కనకరాజు' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన రోజు నుంచే హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
అనంతపురం జిల్లా పెనుగొండ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. కనకరాజు(వరుణ్ తేజ్) అనే పక్కా లోకల్ కుర్రాడి శరీరంలోకి, ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర పాయింట్ తో ఇది తెరకెక్కింది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తోంది.
రెండో వారంలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు భారీ ప్రాఫిట్స్ అందించిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Varun Tej, Korean Kanakaraju, 10 Days Collections, 50 Crore Gross






