.webp)
సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటు వెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. దీంతో ఆటోమాటిక్ గా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ప్రీవియస్ హిట్ చెన్నై లవ్ స్టోరీ తో అయితే నటుడిగా ఒకే సారి వంద మెట్లు పైకి ఎక్కాడు. తాజాగా తన సరికొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తూ విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విత్ ఇన్ రిలీజ్ ఆలస్యమన్నట్టుగా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
కిరణ్ అబ్బవరంకి చెందిన KA ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి 'హఠః' (HATAH) అనే అత్యంత ఆసక్తికరమైన శీర్షిక ఖరారు చేశారు. .ముఖ్యంగా పోస్టర్‌లో కనిపించిన నల్లపిల్లి రూపం, దానికి తోడు “ఈ పిల్లి అసలు బతికే ఉందా లేక...” (Is this cat alive or...) అంటూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఆధారిత మిస్టరీ డ్రామాతో తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. భౌతిక శాస్త్రంలో ప్రాచుర్యం పొందిన ప్రముఖ ‘ష్రోడింగర్ క్యాట్’ (Schrödinger's Cat) థియరీతో ఈ సినిమా కాన్సెప్ట్ ముడిపడి ఉందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ ప్రకటన వెలువడిన కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఎక్స్ (ట్విట్టర్) లో ట్రెండింగ్ కావడం, వేలాది రీట్వీట్లు మరియు లైక్‌లు రావడం విశేషం.
Also Read: మరోసారి విలన్ గా నాగార్జున: ఈ స్టార్ హీరో మూవీనే
"హఠః - వాట్ యూ నెవర్ సా కమింగ్" అంటూ మేకర్స్ త్వరలోనే టీజర్ రాబోతోందని అధికారికంగా వెల్లడించడంతో టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ఆదరించే ప్రస్తుత ట్రెండ్‌లో కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి! అనూష్ గోరక్ దర్శకుడు.

[Kiran Abbavaram, Hatah, KA Productions, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






