Home

»

Latest News

కోలీవుడ్ కి DNK : ఏకంగా టూరిస్ట్ ఫ్యామిలీ బ్యానర్‌లోనే మూడో సినిమా?

Nov 16, 2026 5:40PM

 

'90s  ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో మౌళి ప్రస్తుతం 'DNK' (దొంగ నా కొడుకు) తో థియేటర్స్ లో ఉన్న విషయం తెలిసిందే. మౌళి  ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌పై కన్నేశాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  

 తమిళంలో 'గుడ్ నైట్', 'లవర్', 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తూ, కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే కాకుండా వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'మిలియన్ డాలర్ స్టూడియోస్' బ్యానర్‌లో మౌళి తన మూడో సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అచ్చమైన మధ్యతరగతి భావోద్వేగాలను, నేచురల్ హ్యూమర్‌ను ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా తెరకెక్కించడంలో ఈ నిర్మాణ సంస్థకి  ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి క్రేజీ నిర్మాణ సంస్థతో మౌళి చేతులు కలపడం ఆయన కెరీర్‌లో ఓ సరికొత్త మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: హిందుస్థాన్ ఎవరి సొంతం కాదు: లెజండ్రీ సింగర్ కీలక వ్యాఖ్యలు!
 

 ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు టాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మౌళి, ఈ కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో నేరుగా తమిళ ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం.

కేవలం నటనపరంగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మౌళి, ఈ తమిళ ప్రవేశంతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ న్యూస్ ప్రస్తుతం రూమర్ హోదాతోనే సరిపెట్టుకుంటూ ఉంది సుమి.

 

మీకు నచ్చవచ్చు:ఎంత పని చేసింది సాయిపల్లవి తల్లి.. ఫ్యాన్స్ షాక్!
మీకు నచ్చవచ్చు:ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రీతి ముకుందన్: డేట్ లాక్ చేసుకోండి! 

 

[Mouli, Dnk movie, Million Dollar Studios, Kollywood entry, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com