Home

»

Latest News

త్రిష పెంపుడు కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్: గెస్ట్ గా ఎవరొచ్చారో తెలిస్తే షాక్ అవుతారు!

Nov 16, 2026 4:02PM


'డాగ్' అని తేలిగ్గా తీసిపారేయద్దు. అది వీధిలో ఉన్నంత సేపే డాగ్. ఇంట్లో ఉంటే దానికి ఒక పేరు ఉంటుంది. మరి త్రిష లాంటి సెలబ్రిటీ దగ్గర ఉంటే పేరు కూడా ఒక రేంజ్ లో ఉంటుంది.  పేరు 'ఇజ్జీ'.. చూసారుగా ఏ రేంజ్ లో ఇచ్చిపడేసిందో..

రీసెంట్ గా 'ఇజ్జీ' (Izzy) మొదటి పుట్టినరోజు వేడుకలని త్రిష అత్యంత ఘనంగా తన కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను త్రిష తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో, ఆ పిక్స్ నెట్టింట  వైరల్ అవుతున్నాయి. 

ఈ పుట్టినరోజు వేడుకల కోసం ఇజ్జీ కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఎరుపు రంగు డాగ్-షేప్ కేక్, మరియు డోనట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. కేక్ ముందు ఎంతో ముద్దుగా, అటెన్షన్‌లో కూర్చున్న ఇజ్జీ భంగిమ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వేడుకలో త్రిష కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఆ ఫర్ బేబీపై తమ ప్రేమను కురిపించారు. కేవలం 1 సంవత్సర వయస్సు పూర్తి చేసుకున్న ఈ చిన్న పప్పీతో గడిపిన మధుర క్షణాలను త్రిష సోషల్ మీడియాలో ముద్దుగా పంచుకున్నారు.

 

ఇది కూడా చదవండి:సోనియా గాంధీ బయోపిక్ రెడీ: హీరోయిన్ ఈమెనే: జోష్ లో ఫ్యాన్స్!
 

"నేను నిన్నటితో వన్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. నా కడుపు కొంచెం బాగోలేకపోవడం వల్ల మా పార్టీని చిన్నదిగా మరియు సింపుల్‌గా ముగించాము. అయినప్పటికీ నా ఇష్టమైన మనుషుల మధ్య అద్భుతమైన సమయాన్ని గడిపాను. మాకు ప్రేమని , ఆశీస్సులని  అందించిన అందరికీ ధన్యవాదాలు" అంటూ ఇజ్జీ తరఫున త్రిష ఒక క్యూట్ క్యాప్షన్‌  జత చేసింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, జంతువులపై తనకున్న ప్రత్యేక మమకారాన్ని ఆమె ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారనేది మరోసారి నిరూపితమైంది.

 

మీకు నచ్చవచ్చు:ప్రముఖ హీరో పెళ్లి: వరుడు ఎవరో కాదు ఆ హీరో అన్నయ్య కొడుకే!
మీకు నచ్చవచ్చు:రామాయణ ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే!

 

[Trisha, Trisha Krishnan,  Izzy, Tollywood, Kollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com