Home

»

Latest News

'జైలర్ 2'లో మరో బిగ్ స్టార్: ట్రైలర్‌లో కనిపించింది అతనేనా.?

Oct 7, 2026 12:17PM

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌లో రజినీకాంత్ మాస్ విశ్వరూపం, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ క్యామియోలు ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాయి. కానీ వీటన్నింటికంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో స్టార్ పేరు తెగ వైరల్ అవుతోంది. అతడే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.

'జైలర్ 2' ట్రైలర్‌లో ఒకే ఒక సెకన్‌ కనిపించే ఓ సిల్హౌట్ షాట్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోంది. వెనుక నుంచి కనిపించే ఆ వ్యక్తి హృతిక్ రోషన్‌లా ఉన్నాడని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా ట్రైలర్‌లో సుమారు 1 నిమిషం 31 సెకన్ల దగ్గర కనిపించే ఆ షాట్‌ను జూమ్ చేసి మరీ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. 

నిజానికి హృతిక్ రోషన్ 'జైలర్ 2'లో స్పెషల్ క్యామియో చేస్తున్నాడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ ఏడాది జూన్‌లోనే ఆయన ఈ సినిమాలో భాగమయ్యారనే వార్తలు వచ్చాయి. రజినీకాంత్‌తో కలిసి హృతిక్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించబోతున్నాడని కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి.

అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు హృతిక్ క్యామియోపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ట్రైలర్‌లో ఈ సిల్హౌట్ కనిపించడంతో.. ఇన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమేనా? అంటూ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా చర్చిస్తున్నారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రజినీకాంత్, హృతిక్ రోషన్‌కు ఇది నిజంగా చాలా స్పెషల్ రీయూనియన్. వీరిద్దరూ గతంలో ‘భగవాన్ దాదా’ సినిమాలో కలిసి కనిపించారు. అప్పటికి హృతిక్ చిన్నపిల్లాడిగా ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన తర్వాత మళ్లీ రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే అది ఫ్యాన్స్‌కు నోస్టాల్జిక్ ట్రీట్ అవుతుంది. 

అయితే ట్రైలర్‌లో కనిపించింది నిజంగానే హృతిక్ రోషనేనా? లేక కావాలనే డైరెక్టర్ నెల్సన్ పెట్టిన మరో ట్విస్ట్‌నా? అనేది మాత్రం సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్‌గానే ఉండొచ్చు. 'జైలర్ 2' అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.

ఇది కూడా చదవండి: జిమ్ జిమ్ తార.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట ఈ సినిమాలోదే.!

 

 

 

[Hrithik Roshan in Jailer 2 Trailer, Jailer 2 Movie, Jailer 2 Trailer, Rajinikanth, Hrithik Roshan, Mohanlal, Shiva Rajkumar, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com