
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సంక్రాంతి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఇద్దరూ ఒకే చోట జంటగా ప్రయాణిస్తూ కనిపించడంతో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు ఊపందుకున్నాయి.
అయితే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 'ఎల్లమ్మ' (Yellamma) తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ప్రకటన ఇంతవరకు రాలేదు. దీంతో ఐశ్వర్య రాజేష్‌ని ఎంపిక చేశారనే బలమైన వార్తలు ఫిలింనగర్ కారిడార్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ లేదా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నిమిత్తం ప్రయాణంలో భాగంగానే వీరు ఎయిర్‌పోర్ట్‌లో కలసి కనిపింటారని, ఇది ఒక వ్యాపారపరమైన లేదా వృత్తిపరమైన ప్రయాణమే తప్ప వ్యక్తిగత వ్యవహారం కాదనేది కూడా టాక్.

ఇది కూడా చదవండి: ఓటీటీ ఫిక్స్: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?..దేశం సాంగ్ యాడ్!
కేవలం ఎయిర్‌పోర్ట్ రాకపోకల ఆధారంగా డేటింగ్ టాక్ వైరల్ కావడం సినిమా ఇండస్ట్రీలో సహజమే అయినప్పటికీ, 'ఎల్లమ్మ' సినిమా అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ ప్రచారాలకి తెరపడేలా కనిపించడం లేదు.
[Devi Sri Prasad And Aishwarya Rajesh Airport Rumours, Devi Sri Prasad, Aishwarya Rajesh, DSP Aishwarya Rajesh airport, Yellamma movie update, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]






