Home

»

Latest News

జిమ్ జిమ్ తార: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట ఈ సినిమాలోదే.!

Oct 7, 2026 11:48AM

సినిమా చిన్నదైనా.. ప్రమోషన్ మాత్రం భారీగా ఉండాలి. నిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తుంటారు. కానీ, ఓ చిన్న సినిమా మాత్రం కేవలం ఒకే ఒక్క పాటను పట్టుకుని.. దాన్నే తమ సినిమాకు అతిపెద్ద ప్రమోషన్ అస్త్రంగా మార్చుకుంది. ఆ సినిమా పేరు ‘పర్ణశాల’.

వై.జి. భరత్ దర్శకత్వంలో ఎస్ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీ హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది. అయితే సినిమా కంటే ముందే ‘జిమ్ జిమ్ తార’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాటను లక్ష్మీదేవితో పాడించడం కూడా ఆసక్తికరంగా మారింది. మొదట ఈ పాటను ప్రత్యేకంగా ప్రమోషన్ కోసం ఉపయోగించాలనే ఆలోచనతో మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

కానీ.. ఆ తర్వాత జరిగినదే అసలు ట్విస్ట్. పాటకు వచ్చిన రెస్పాన్స్‌ను గమనించిన టీమ్.. దాన్ని మామూలు సాంగ్‌గా వదిలేయకుండా, సినిమా ప్రమోషన్‌లోనే ప్రధాన ఆయుధంగా మార్చేసింది.

సాధారణంగా ఓ పాటను వైరల్ చేయాలంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించడం, పెయిడ్ క్యాంపెయిన్లు నిర్వహించడం, ప్రమోషనల్ కంటెంట్ వరుసగా రిలీజ్ చేయడం లాంటివి చేస్తుంటారు.

కానీ ‘పర్ణశాల’ విషయంలో సీన్ రివర్స్ అయింది. ఎలాంటి భారీ పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే ‘జిమ్ జిమ్ తార’ జనాల్లోకి వెళ్లడం మొదలైంది. సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి.. సాధారణ ప్రేక్షకుల నోట కూడా ఈ పాట వినిపించే స్థాయికి చేరిందని మేకర్స్ చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ‘పర్ణశాల’ టీమ్‌కు పెద్ద ప్లస్‌గా మారింది.

సినిమా ప్రమోషన్‌కు కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఈ టీమ్ చెప్పకనే చెబుతోంది. ట్రెండ్‌ను గుర్తించడం.. దాన్ని సరైన సమయంలో క్యాచ్ చేయడం.. ఆ ట్రెండ్‌ను తమ సినిమాకు అనుకూలంగా మార్చుకోవడం.. ఇదే అసలు మార్కెటింగ్ అని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.

‘జిమ్ జిమ్ తార’కు వచ్చిన బజ్ కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం కాకుండా సినిమా మీద ఆసక్తిని పెంచితే.. ‘పర్ణశాల’కు బిజినెస్ పరంగా కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.

థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ, ఆడియో రైట్స్ విషయంలో కూడా సినిమాపై ఉన్న బజ్ ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ ప్రమోషన్ స్ట్రాటజీపై ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందా.. లోకేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో.? 

 

 

 

[Jim Jim Tara Song, Zim Zim Tara Song, Parnashala Movie, Gokula Lakshmi Dev, Lakshmi Aunty, Telugu Songs 2026, Trending Song Telugu, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com