
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన డెబ్యూ చేసే ఛాన్స్ అంటే.. ఏ కొత్త హీరోయిన్‌కైనా అది గోల్డెన్ ఆఫరే. అలాంటి భారీ అవకాశమే సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వికి దక్కింది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’తో ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా ఆమె కెరీర్ ప్లానింగ్‌పై చర్చకు కారణమవుతోంది.
‘ఫౌజీ’ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇమాన్వి ఈ ప్రాజెక్ట్‌కే చాలా సమయం కేటాయించింది. ఇదే సమయంలో ఆమెకు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చినా.. కొత్త సినిమాలకు సైన్ చేయకుండా వెయిట్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌తో డెబ్యూ చేస్తున్న సినిమాపై ఆమె పెట్టుకున్న నమ్మకమేనని అంటున్నారు. సాధారణంగా ఒక పెద్ద స్టార్‌తో తొలి సినిమా చేస్తే.. ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చే గుర్తింపు, మార్కెట్ క్రేజ్‌ను బట్టి భారీ అవకాశాలు రావొచ్చని భావిస్తారు. ఇమాన్వి కూడా అదే ఆలోచనతో ‘ఫౌజీ’ రిలీజ్ వరకు వెయిట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ‘ఫౌజీ’ని ముందుగా 2026 డిసెంబర్ 3న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా పనులు పూర్తికాకపోవడంతో ఆ రిలీజ్‌ను 2027కి వాయిదా వేశారు. దీంతో ఇమాన్వి డెబ్యూ కూడా మరింత ఆలస్యం అవుతోంది.
ఒక కొత్త నటికి తొలి సినిమా రిలీజ్ చాలా కీలకం. ఆ సినిమా రిజల్ట్, పాత్రకు వచ్చిన స్పందన.. తర్వాతి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ‘ఫౌజీ’ కోసం ఓపికగా వెయిట్ చేయడం ఇమాన్వికి ఎంతవరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే మరో కోణంలో చూస్తే.. ఇమాన్వికి ఇది రిస్క్‌తో కూడుకున్నా, భారీ రివార్డ్ ఇచ్చే నిర్ణయమే కావచ్చు. ‘ఫౌజీ’ ప్రభాస్ కెరీర్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా. ఈ సినిమా సక్సెస్ అయితే ఇమాన్వి కెరీర్‌కు భారీ ప్లస్ కావచ్చు.
ఇది కూడా చదవండి: ‘వారణాసి’లో హాలీవుడ్ నటి.. మహేష్‌తో రొమాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు.?
[Fauzi Heroine Imanvi, Prabhas Fauzi Movie, Rebel Star Prbhas, Fauzi Movie, Hanu Raghavapudi, Actress Imanvi, Telugu Film News]






