Home

»

Latest News

లేట్ అయినా లేటెస్ట్ గా: దృశ్యం 3 ట్రైలర్ వచ్చేసింది.. ఇంకా చూడలేదా!

Sep 9, 2026 3:00PM

 


దృశ్యం మూవీతో తెలుగు ప్రేక్షకులకి ఉన్న అనుబంధం తెలిసిందే. కూతుర్ని హత్య కేసు నుంచి కాపాడుకోవడానికి సినిమాని విపరీతంగా ప్రేమించే మధ్య తరగతి తండ్రి అదే సినిమా నేర్పిన తెలివితేటలతో కూతుర్ని హత్య కేసు నుంచి ఎలా కాపాడుకున్నాడు   అనేదే దృశ్యం. అప్పట్నుంచి తెలుగు వారికి దృశ్యంతో పాటు కంటిన్యూగా వచ్చే దృశ్యం సిరీస్ ల పై ఒకింత అభిమానమే దాగి ఉంది.


 ఇప్పడు హిందీలో  అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న 'దృశ్యం 3' (Drishyam: The Conclusion) అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలైంది. పనోరమా స్టూడియోస్, స్టార్ స్టూడియోస్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ సుమారు 2 నిమిషాల 52 సెకన్ల నిడివితో ఉత్కంఠభరితంగా సాగింది. విజయ్ సల్గాంకర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పన్నిన వ్యూహాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అభిషేక్ పాఠక్ చాలా త్రిల్లింగ్‌గా ఆవిష్కరించారు. హిందీ ప్రేక్షకుల ముందుకు ఈ కథ ముగింపు ఘట్టంగా రాబోతోంది. "నా నిజం, నా ధర్మం.. కేవలం నా కుటుంబమే" అనే శక్తివంతమైన డైలాగ్‌తో విజయ్ సల్గాంకర్ పాత్ర స్వభావాన్ని మరోసారి ప్రతిబింబించారు.  ఈ మూడో భాగంలో విజయ్ సల్గాంకర్‌కు గతంలో కంటే చాలా పెద్ద ముప్పు ఎదురుకాబోతోంది. మాజీ ఐజీ మీరా దేశ్‌ముఖ్‌గా తబు, ఆమె భర్తగా రజత్ కపూర్ తిరిగి తమ పాత్రల్లో కనిపిస్తుండగా, కొత్తగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ లాయర్ ఇంద్రజిత్ శెట్టిగా, ప్రసిద్ధ నటుడు జైదీప్ అహ్లావత్ ఎస్పీ రాజ్వీర్ సింగ్ తోమర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురు దిగ్గజ నటుల కాంబినేషన్‌లో సల్గాంకర్ కుటుంబం ఎదుర్కొనే సవాళ్లు ట్రైలర్‌లో అత్యంత ఆసక్తికరంగా మారాయి. శ్రీయా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ యాదవ్ కూడా నందిని, అంజు, అను పాత్రల్లో తిరిగి నటించారు.  

 

 

Also Read: ఫ్యాన్స్ షాక్: బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత పెళ్లిళ్లల్లో డ్యాన్స్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న స్టార్ హీరో 

ఫ్రాంచైజీ సెంటిమెంట్‌కు అనుగుణంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజే  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2015 నుండి కొనసాగుతున్న ఈ కేస్ స్టోరీకి ఇది ఆఖరి ఘట్టం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. 

 

 

[Drishyam 3, Ajay Devgn, Tabu, Drishyam 3 Hindi Trailer, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com