Home

»

Latest News

మళ్ళీ మీ ముందుకు పిచ్చెక్కించే బోల్డ్, రొమాంటిక్ పార్ట్ 3 : కోరికలే గుర్రాలైతే!

Sep 9, 2026 3:28PM

 

 

బోల్డ్ అండ్ రొమాంటిక్  కంటెంట్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే 'ఛీ ఛీ ఇదేం సబ్జెట్ అంటారు. కానీ ఇరగబడి చూస్తుంటారు. శృతిమించి విమర్శలు చేసిన వారు సైతం రహస్యంగా ఒక్కరే చూసి 'ఆహా ఏం తెరకెక్కించారు. మనం బయట నిత్యం ఇలాంటి కహాని లు చూస్తూనే ఉన్నాం కదా అనుకుంటారు.

ఈ కోవకి చెందిన మూవీ 'లస్ట్ స్టోరీస్'. మొదటి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి.  ఒకవైపు ఆకర్షణ, మరొకవైపు గుండెల్లో దాగి ఉన్న రహస్య కోరికలు, ఇంకోవైపు బంధాల నడుమ నలిగిపోయే మనుషుల నిజరూపాలుతో రాగా, ఇప్పుడు మూడో పార్ట్  'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్‌ తాజాగా విడుదలై సోషల్ మీడియాని  షేక్ చేసింది. మరింత డ్రామా, రొమాన్స్, బోల్డ్ కంటెంట్ మరియు సంక్లిష్టమైన మానవ సంబంధాలను మన ముందుకు తీసుకువస్తోంది.

ఈ ప్రత్యేకమైన ఆంథాలజీ ప్రాజెక్ట్ కోసం భారతీయ చిత్రసీమలోని 4 మంది దిగ్గజ దర్శకులు చేతులు కలిపారు. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా మరియు విశాల్ భరద్వాజ్ లాంటి ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు 4 వేర్వేరు కోణాల్లో ఈ ప్రేమ, మోహం మరియు ఆకర్షణల కథలని మలిచారు. సమాజంలో ఇప్పటికీ విప్పడానికి జడిసే ఎన్నో సున్నితమైన అంశాలని , మనుషుల మనస్సులోని ప్రతిబింబాలను ఈ 4 షార్ట్ ఫిలిమ్స్‌ ద్వారా చాలా ధైర్యంగా ఆవిష్కరించబోతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఏర్పడే గందరగోళాలు, దాచుకున్న బంధాల వెనుక ఉండే అసలు సత్యాలు ఈ కథల్లో అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

నటీనటుల విషయానికి వస్తే, ఏకంగా 10 మందికి పైగా దిగ్గజ, ప్రముఖ నటీనటులతో అత్యంత నక్షత్ర సమూహంతో ఈ సీరీస్ రూపొందింది. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, విజయ్ వర్మ, సిద్ధార్థ్, ఆలీ ఫజల్, అభిషేక్ బెనర్జీ, రాధికా మదన్, గుర్ఫతే పిర్జాదా మరియు సనా థంపి వంటి ప్రముఖ తారలు ఈ కథల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా హిందీ, సౌత్ ఇండియా సినీ రంగాలకు చెందిన ఈ క్రేజీ స్టార్ కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఒక్కో దర్శకుడికి ఉన్న విభిన్నమైన టేకింగ్ స్టైల్ ఈ ఆంథాలజీని ఎంతో ప్రత్యేకంగా మలిచింది.

 


Also Read: లేట్ అయినా లేటెస్ట్ గా: దృశ్యం 3 ట్రైలర్ వచ్చేసింది.. ఇంకా చూడలేదా!


ట్రైలర్ పరిశీలిస్తే... రోజువారీ సాధారణ జీవితానికి అలవాటుపడిన మనుషులు, ఊహించని కోరికలకి లోనైనప్పుడు వారి జీవితాలు ఏ తీరానికి చేరుకుంటాయో విక్రమాదిత్య మోత్వానే విభాగంలో చూపించారు. అలాగే చిన్న ఆకర్షణ కూడా ఎలాంటి అనుకోని పర్యవసానాలకు దారితీస్తుందో కిరణ్ రావ్ దర్శకురాలిగా వినోదాత్మకంగా, ఉత్కంఠభరితంగా చెక్కారు. మరోవైపు బంధాలలో స్పష్టత లేని మనుషుల మానసిక ఘర్షణలను శకున్ బాత్రా ఆవిష్కరించగా, విశాల్ భరద్వాజ్ తనదైన శైలిలో కోరికలు మరియు కల్పనా ప్రపంచం నడుమ నడిచే ప్రయాణాన్ని ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18, 2026 నుంచి ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ఆర్‌ఎస్‌విపి (RSVP) మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ లస్ట్ స్టోరీస్ 3, డిజిటల్ వీక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. 4 రకాల విభిన్నమైన ప్రపంచాలు, 4 కొత్త ప్రేమ కథలు, అంతకుమించిన ఉత్కంఠభరిత డ్రామా చూడటానికి ప్రేక్షకులు కూడా సెప్టెంబర్ 18 కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

[Lust stories 3, Lust stories 3 Trailer, Radhika Apte, Netflix, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com