Home

»

Latest News

ఫ్యాన్స్ షాక్: బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత ఆ పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నస్టార్ హీరో

Sep 9, 2026 2:41PM

 


రాహుల్ రాయ్.. 90’sలో స్టార్ డమ్ హోదాని అనుభవించిన బాలీవుడ్ నటుడు. ముఖ్యంగా ఆషిఖీ’ చిత్రంతో లెక్కలేనంత మంది అభిమానులని సంపాదించడమే కాకండాప్రత్యేకమైన రూపం హెయిర్‌స్టైల్‌తో తనకంటూ ఒక 'ఆరా' క్రియేట్ చేసుకున్నాడు. ‘జునూన్’, ‘ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ’ వంటి  సూపర్ హిట్ చిత్రాలు కూడా తన ఖాతాలో ఉన్నాయి.


 సుమారు 37 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించిన ఈ నటుడి జీవితం 2020లో ఊహించని విషాద మలుపు తిరిగింది. కార్గిల్‌లో ‘ఎల్‌ఏసీ – లైవ్ ది బ్యాటిల్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా  బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ, నీ కెరీర్ మాత్రం తీవ్రంగా దెబ్బతింది.

ఈ విషాదకర సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడాల్సి వచ్చింది. అనారోగ్యం నుంచి కోలుకుని, శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో ఆయనకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు లభించలేదు. అనారోగ్యం కారణంగా సినిమాలు దూరం కావడంతో ఆర్థిక ఇబ్బందులు, నిత్యం వాడాల్సిన మందుల ఖర్చులు, ఇంటి నిర్వహణ భారం రాహుల్ రాయ్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేసాయి. మరోవైపు తన ఆస్తులన్నింటినీ మాజీ భార్య పేరిట రాయాల్సి రావడంతో, ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సులో ఆయన మళ్లీ మొదటి నుంచి తన లైఫ్ స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. పైగా బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు నుంచి ఉన్న  చట్టపరమైన వివాదాలు, కోర్టు ఖర్చులు  అదనపు భారంగా మారాయి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో జీవనోపాధి కోసం, కుటుంబ పోషణ కోసం ఆయన ఎలాంటి సంకోచం లేకుండా తనకు దొరికిన పనిని స్వీకరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే పెళ్లిళ్లలోతో పాటు శుభకార్యాలలో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఒక పెళ్లిలో ఇచ్చే ప్రదర్శనకు గానూ  2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు పారితోషికం పొందుతారు. ఆ వచ్చిన డబ్బుతోనే నెలకు కావలసిన మందుల ఖర్చులు, నిత్యావసరాలు మరియు ఇతర కుటుంబ వ్యయాలను నెట్టుకొస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

 


Also read: వామ్మో వారణాసి తెలుగు రైట్స్ అన్ని కోట్లా: అసలు ఆ బిజినెస్ నిజమేనా! 

అయితే, ఆయన పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విమర్శలపై రాహుల్ రాయ్ ఎంతో నిగ్రహంతో, ప్రశాంతంగా స్పందించారు. "ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చుని నన్ను ట్రోల్ చేసేవాళ్లకు, అనారోగ్యం తర్వాత ఈ వయసులో నిలబడి డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో తెలియదు. నేను ఎవరి ముందూ చేతులు చాచడం లేదు, స్వశక్తితో కష్టపడి నిజాయితీగా నా కడుపు నింపుకుంటున్నాను" అని గట్టిగా సమాధానమిచ్చారు. 

 

 

 

[Rahul Roy, brain stroke, Marriage Dance, Ashiqui, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com