
డిసెంబర్ లో తెలుగు సినిమా 'తగ్గేదెలే' అనే రీతిలో తన ప్రతాపాన్ని చూపించనుంది. అందుకే వింటర్ అయిన సినీ సమ్మర్ మాత్రం పక్కా. ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీన టాలీవుడ్ తెరపై ఊహించని రీతిలో భారీ పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఒకే రోజున పలువురు యువ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నాగచైతన్య, నితిన్, విశ్వక్‌సేన్ వంటి ప్రముఖ హీరోలు ఒకే తేదీని టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. నాగచైతన్య ప్రెస్టేజియస్ట్ మూవీ 'వృషకర్మ' డిసెంబర్ 4న విడుదల కానున్నట్లు చిత్రబృందం చాలాకాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది. 'విరూపాక్ష' వంటి సంచలన విజయం అందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తుండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో గోల్డెన్ లెగ్ సుందరి 'మీనాక్షి చౌదరి' హీరోయిన్. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు నితిన్ 'అలియాస్ రుక్మిణి' కూడా సరిగ్గా అదే డిసెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. 'దండోరా' ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తుండగా నాచురల్ స్టార్ నాని నిర్మాత. నితిన్ సరసన రుక్మిణిగా చేస్తుంది ఎవరనే సస్పెన్స్ అక్టోబర్ 13న వీడనుంది.
ఇది కూడా చదవండి: ఆది సాయికుమార్ సంచలన పోస్ట్: ఎవరు ఆ హీరో? యూట్యూబర్ కి ఉన్న ఇమేజ్ లేదా!
విశ్వక్‌సేన్ 'లెగసీ' కూడా డిసెంబర్ 4 న రాబోతుంది . సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రాజకీయ నేపథ్య చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇలా ఒకే రోజు ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో తలపడుతుండటంతో థియేటర్ల కేటాయింపు మరియు ఓపెనింగ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ డిసెంబర్ 4 బాక్సాఫీస్ సమరంలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.
.webp)
అదే రోజు ఇటీవల మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ సినిమా శ్రీశ్రీ కూడా డిసెంబర్ 4నే రాబోతుంది. పూజా హెగ్డే హీరోయిన్ కావడం స్పెషల్ ఎట్రాక్షన్.
[December 4 Box Office Clash, Naga Chaitanya Vrushakarma, Nithiin Alias Rukmini, Vishwak Sen Legacy, Tollywood movie updates, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






