
ఇక చాలు బాబు ప్లాపులు అనుకునే పరిస్థితి నుంచి రాబోయే చిత్రాలతో హిట్టు మీద హిట్టు మన సొంతం అనేలా నితిన్ తన అప్ కమింగ్ ట్రాక్ లైన్ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే డిసెంబర్ డిసెంబర్ 4 న 'అలియాస్ రుక్మిణితో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నాడు.
అయితే టైటిల్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రుక్మిణి గా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ (Aafiya Syed) కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, రుక్మిణీ గా ఎవరు కనిపించబోతున్నారనేది మేకర్స్ అక్టోబర్ 13న అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: వార్: ఈ యుద్దాన్ని ఆపేవారు ఉన్నారా!

ఆఫియా సయ్యద్ అయితే మాత్రం తెలుగు ప్రేక్షకుల పంట పండినట్టే. ఆఫియా ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ నెల 2 న రిలీజైన 'ప్రేమ్ కితాను' తో సందడి చేస్తూ ఉంది. అలియాస్ రుక్మిణి ప్రమోషన్స్ అప్పుడే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌పై నాచురల్ స్టార్ నాని భాగస్వామ్యం ఉండటం సినిమాపై హైప్‌ను మరింతగా పెంచేసింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు.
[Nithiin Alias Rukmini Heroine Aafiya Syed, Nithiin, Alias Rukmini Release Date, Nani, Aafiya Syed, December 4 release,Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






