Home

»

Latest News

ఆది సాయికుమార్ సంచలన పోస్ట్: ఎవరు ఆ హీరో? యూట్యూబర్ కి ఉన్న ఇమేజ్ లేదా! 

Oct 10, 2026 3:18PM

 


తొలి చిత్రంతోనే వంద రోజుల పోస్టర్ స్టేట్ మొత్తం అతికేలా చేసిన ఆది సాయికుమార్ ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ ని తన పిన్ కోడ్ గా మార్చుకున్నాడు.  కానీ ప్రీవియస్ మూవీ శంభాల తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని విమర్శకుల నోళ్లు మూయించి కట్ అవుట్ కి ఉన్న రేంజ్ తగ్గలేదని నిరూపించాడు.

రీసెంట్ గా ఒక నెటిజెన్ సోషల్ మీడియా వేదికగా 'కొందరు హీరోలకి కనీసం యూ  ట్యూబర్స్ కి ఉన్న ఫాలోయింగ్ కూడా ఉండదనే పోస్ట్ చేసాడు. అందుకు ఆది రిప్లై ఇస్తూ 'సామాజిక మాధ్యమాలు విస్తరించిన ఈ రోజుల్లో ఇతరులను కించపరచడం, ట్రోల్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఎవరి ప్రతిభను వారు గౌరవించుకోవాల్సింది పోయి, పది మందిలో ఎదుటివారిని చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోవడంపై ప్రముఖ టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఇతరులను కిందికి లాగడానికి ప్రయత్నించడం కంటే, వారిలో ఆత్మస్థైర్యం నింపేలా ప్రోత్సహించడం ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరిదైన రంగంలో కష్టపడుతుంటారని, అలాంటి వారిని నిరుత్సాహపరచకుండా చేయూతనందించే మంచి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే ఇతరులను కించపరిచేలా కామెంట్లు చేస్తుండటం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుండటం చాలా బాధాకరమని ఆది అభిప్రాయపడ్డారు. కేవలం సరదా కోసం లేదా వ్యూస్ కోసం ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే తీరు మారాలని ఆయన సూచించారు. ఒక వ్యక్తిని పైకి లేపడం చేతకనప్పుడు, కనీసం వారిని కిందకు లాగే ప్రయత్నం చేయకూడదన్న కఠిన సత్యాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరహా ప్రతికూలత కేవలం సెలబ్రిటీలను మాత్రమే కాకుండా, సామాన్య ప్రజలను, ముఖ్యంగా అభివృద్ధి చెందాలని చూస్తున్న యువతను మానసికంగా తీవ్రంగా కుంగదీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: విజయదశమికి పెద్ద హీరోల సినిమాలు ఎందుకు విడుదల కావు: టాలీవుడ్ బాక్సాఫీస్ అసలు రహస్యం!

 

 

ఒకరి విజయాన్ని చూసి ఓర్వలేకపోవడం లేదా అసూయ పడటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని, బదిలీగా అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా నిలిస్తేనే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఆది సాయికుమార్‌ పేర్కొన్నారు. సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా ప్రయాణం ఎవరికీ అంత సులభంగా సాగిపోదు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్లేవారితో సానుకూలంగా ఉండటం సమాజ బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సానుకూల దృక్పథాన్ని (Positive Attitude) పెంపొందించుకోవాలని, సృజనాత్మకతను ప్రోత్సహించే వాతావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా, నెటిజన్ల నుంచి విశేష స్పందనని  పొందుతున్నాయి.

 

[Aadi Saikumar Comments On Social Media, Aadi Saikumar, Telugu actor news, Aadi Saikumar comments, social media negativity, Tollywood updates,telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com