TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

సమంత రీఎంట్రీ.. హీరో విశాల్‌ ఆశలు! మరి అదే టైం అంటే!

Nov 26, 2026 2:55PM


సినిమా అంటేనే భారీ వెయిటింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్. అది ఎన్ని సంవత్సరాలో ఎవరకి తెలియదు. కానీ వెయిట్ కి తగ్గ ఫలితం వస్తే మాత్రం అభిమానులు, బాక్స్ ఆఫీస్ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఇప్పుడు ఈ వాస్తవాన్ని చెప్పుకునే అవకాశం విశాల్ కల్పించాడు. 

విశాల్ , సమంత  జంటగా  నటించిన సూపర్ హిట్ మూవీ ‘అభిమన్యుడు'.2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘ఇరుంబు తిరై’ పేరుతో తెరకెక్కగా   పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. టెక్నాలజీ, సైబర్ నేరాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి అంశాలతో తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే దీనికి సీక్వెల్ తీసుకురావాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. 

తాజా ప్రచారం ప్రకారం.. ఈ సీక్వెల్‌లో కథని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారట. మొదటి భాగంలో సైబర్ క్రైమ్, డేటా చోరీ ప్రధాన అంశాలుగా ఉంటే.. రెండో భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం చుట్టూ కథ తిరగనుందని సమాచారం.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? దాని వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి? అనే అంశాలను ఉత్కంఠభరితంగా చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇక సమంత కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారనే టాక్ నడుస్తోంది. ఆమె రీఎంట్రీ తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే పూర్తి నటీనటుల వివరాలు, సమంత రోల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: నువ్వా నేనా:ఆ హీరో నా వాడే.. కాదు నా వాడే!

ఇప్పటికే సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ‘అభిమన్యుడు 2’ వార్త నిజమైతే ఆమె ఖాతాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరినట్లే. 

మొత్తానికి సమంత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్‌తో మరోసారి జతకట్టి ‘అభిమన్యుడు 2’లో సమంత సందడి చేస్తారా? ఈ సీక్వెల్‌లో ఏఐ నేపథ్యంలో ఎలాంటి కొత్త కథని  చూపించబోతున్నారు? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

మీకు నచ్చవచ్చు

అల్లు అర్జున్  25 వ సినిమా: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

Nanna Kutty Movie Review Telugu: నాన్న కుట్టి మూవీ రివ్యూ 

 

google-ad-img