TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఒకేసారి సాంగ్స్ రిలీజ్ చేస్తే: మీ సొమ్ము ఏమైనా పోతుందా..అభిమానుల సూటి ప్రశ్న!

Nov 25, 2026 10:28AM

ఉదయాన్నే పేపర్ లో అభిమాన హీరో సినిమా స్టార్ట్ అయ్యిందనే అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక అంతే అభిమానుల ఆనందం యొక్క స్థాయిని ఏ ఫేమస్ కవి కూడా వర్ణించలేడు. అంతలా సంబరపడిపోతూ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ తో ఉంటాడు. సాంగ్స్ రిలీజ్ అయ్యే  ముహూర్తం రానే వచ్చింది. అదేనండి  ఆడియో క్యాసెట్  రిలీజ్. తనకి తెలిసిన  ఆర్టీసీ డ్రైవర్ కో,ఆటో డ్రైవర్  కో డబ్బులు  ఇచ్చి  క్యాసెట్  తెప్పించుకునే వాళ్ళు.  

సాంగ్స్  వినబోతూనే  సాంగ్స్  సూపర్ గా ఉండాలని టెన్షన్ పడిపోతూ ఇష్టదైవాల్ని ప్రార్థిస్తాడు. ఎందుకంటే సాంగ్స్ బాగుంటే సినిమా సగం హిట్ అయ్యినట్లే. పైగా సినిమాపై అభిమానికి గాని, ప్రేక్షకులకి గాని ఫస్ట్ ఇంప్రెషన్ కలిగించేది సాంగ్స్. అంతటి శక్తీ ఉంది సాంగ్స్ కి. 

పర్ సపోజ్ కథ, కథనం, అభిమాన హీరో క్యారక్టరయిజేషన్  బాగోకపోయినా సినిమాని   కొన్ని రోజులు పాటు నడిపించే ఇంధనం లాగా కూడా సాంగ్స్ పని చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఎవరు  నేర్పిన పైత్యమో, సొంతంగా నేర్చుకున్నారో తెలియదు గాని, ఒక్కో సాంగ్ ని ఒక్కో రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే  సినిమా రిలీజ్ ఎల్లుండి అనగా కూడా రిలీజ్ చేస్తున్నారు. 

 

దీనిపై  సినీ ప్రియులు, పాటల ప్రేమికులు  సైతం సోషల్ మీడియా వేదికగా  స్పందిస్తూ  పాటలంటే  మీకు ఎందుకు  అంత  చులకన. డియర్  మేకర్స్, హీరోస్ మీ సినిమా చూడాలని ఇంప్రెషన్ కలిగించే మొట్టమొదటి ముడి సరుకు సాంగ్స్. ఆ సాంగ్స్ బాగుంటే  మీ సినిమా రిలీజ్ అయ్యే లోపు మా  అందరి నరనరాల్లోకి  వెళ్తాయి.

ఇది కూడా చదవండి: చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కి మహేష్ బాబు ఫిదా.. 27 మిలియన్ల వ్యూస్‌: చిన్నారి ఎవరో తెలుసా!

దీంతో మీరు కోట్ల రూపాయిల ప్రమోషన్స్ చేసే అవసరం లేకుండానే థియేటర్స్ కి జాతర కి వచ్చినట్టుగా పోటెత్తుతారు. పాటలకి అంతటి శక్తీ ఉంది. మిమ్మల్ని రక్షించే సినీ ఇంధనం. దయ చేసి  సాంగ్స్ మొత్తాన్ని నెల రోజుల ముందు రిలీజ్ చేస్తే మీ సొమ్మేం పోదు. సొమ్ము వస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.  

కాబట్టి మేకర్స్, హీరోలు క్యాసెట్  లు ఇప్పుడు లేవు  కానీ నెట్టింట్లో అయినా ఒకే సారి సాంగ్స్ రిలీజ్ చేస్తే సినిమాకే మంచింది. సినిమాకి మంచి జరిగితేనే కదా! మీరు  అభిమానులు, ప్రేక్షకుల హార్ట్స్ లో కుర్చీ వేసుకొని కూర్చునేది.

మీకు నచ్చవచ్చు

ముఖ్యమంత్రి పీఠం శర్వానంద్ ని వరిస్తుందా!

ఆ హీరోయిన్ బికినీ ని ప్రేమ పేరుతో అభిమాని ఏం చేసాడో తెలుసా!

 

google-ad-img