TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

శర్వానంద్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నాడా: నిన్న రాత్రి  ఏం జరిగిందో తెలిసిపోయింది!

Nov 25, 2026 8:51AM

శర్వానంద్ సెల్యులాయిడ్ పై భోగి తో రావడానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. కెరీర్ లో ఫస్ట్ టైం రా అండ్ రస్టిక్ మూవీ చేస్తున్నాడు. దీంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భోగి పై ప్యూర్ క్యూరియాసిటీ నెలకొని ఉంది. నిన్న ఆల్రెడీ కొంత మంది సినీ ప్రేక్షకులు భోగి చూసారని, మూవీ హిట్ అనే టాక్ హైదరాబాద్ ఫిలిం సర్కిల్స్ లో ఒక రేంజ్ కాన్ఫిడెన్స్ తోనే చక్కర్లు కొడుతుంది. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వినిపిస్తుండటం శుభసూచకం.

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా  ‘భోగి’ మ్యూజికల్ ఈవెంట్‌ జరగగా ప్రముఖ జానపద గాయకుడు నర్సన్నతో శర్వానంద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఈ కార్యక్రమంలో మూవీలోని ‘గంగ’సాంగ్ ని రిలీజ్ చేసారు. ప్రముఖ జానపద గాయకుడు నల్గొండ గద్దర్ అలియాస్ నర్సన్న ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా నర్సన్నతో శర్వానంద్ సరదాగా మాట్లాడారు.

నర్సన్న గురించి ప్రస్తావిస్తూ.. ఆయన చాలామంది రాజకీయ నాయకుల కోసం పాటలు పాడారని, ఆ పాటలు పాడిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని శర్వానంద్ గుర్తు చేశారు. అప్పుడు సరదాగా.. ‘నర్సన్న.. మీరు చాలామందిని సీఎంలను చేశారంట. భోగిలో పాట పాడారు కదా.. మరి నన్ను కూడా సీఎం చేస్తారా? విజయ్‌లాగా’ అంటూ ప్రశ్నించారు. దీనికి నర్సన్న స్పందిస్తూ.. ‘చెప్పలేం అన్నా.. నిజంగా సీఎం అవుతారేమో. దేవుడు అనుకుంటే సీఎం అవుతారు’ అంటూ నవ్వించారు.

నర్సన్న మాటలకి  శర్వానంద్ కూడా సరదాగా స్పందించారు. ‘లేదు.. నేను నటుడిగా హ్యాపీగా ఉన్నాను. అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నా. ఇది చాలు’ అంటూ తన మనసులోని మాట చెప్పారు. దీంతో ఈవెంట్‌లో నవ్వులు విరిశాయి.

ఇది కూడా చదవండి: హీరోయిన్ బికినీ వేలంలో కొన్న అభిమాని: పెళ్లి అయ్యే వరకు వేధింపులు!

 

 

మొత్తానికి ‘భోగి’ ఈవెంట్‌లో శర్వానంద్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదలకు ముందే ఈ ఫన్నీ సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భోగి’. రామ్ చరణ్ రచ్చ ఫేమ్  సంపత్ నంది దర్శకుడు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. డింపుల్ హయాతి మరో హీరోయిన్. నవంబర్ 27 అనే ఎల్లుండి రిలీజ్ డేట్.

మీకు నచ్చవచ్చు

బాలికలని వేధిస్తున్న ప్రముఖ నటుడు: జైలు శిక్ష! 

అజిత్ డేర్ డెవిల్ లో మన ముఖ్యమంత్రి!

 

[Bhogi, Narasanna, Sharwanandh, Sampath nandi, Anupama Parameswara]


 

google-ad-img