
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాదా మూవీ ఫస్ట్ సాంగ్ ‘దాదా ధమాకా’ వచ్చేసింది. బాలయ్య, తమన్ కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా ఓ హై ఎనర్జీ నంబర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ పాటలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఉంది. అదే బాలకృష్ణ స్వయంగా కొన్ని లైన్స్ పాడటం.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాలయ్య మరోసారి తన గొంతు వినిపించారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామ ఏక్ పెగ్ లా’ పాట పాడి అభిమానులను అలరించారు. ఇప్పుడు ‘దాదా ధమాకా’తో మరోసారి సింగర్‌గా మారారు. రజనీ శ్రీ పూర్ణిమతో కలిసి ఈ పాటను ఆలపించి మరింత జోష్ తీసుకొచ్చారు.
బాలకృష్ణ, నర్గీస్ ఫక్రీపై చిత్రీకరించిన ఈ పాటకు తమన్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించారు. రామ్‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ థియేటర్లలో డ్యాన్స్ ట్రీట్ ఇవ్వబోతుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. బాలకృష్ణ స్టైలిష్ లుక్స్, డ్యాన్స్, నర్గీస్ గ్లామర్ సాంగ్ లో హైలైట్ గా నిలిచాయి.
'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కావడంతో 'దాదా'పై భారీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన ‘దాదా ధమాకా’ సాంగ్స్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచుతోంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Dada Dhamaka Song Lyrical Video
[Dada Dhamaka Song, Dada Movie, Nandamuri Balakrishna, Nargis Fkhri, Thaman S]





