Home

»

Latest News

Raaka: రాకాకి అట్లీ రెమ్యూనరేషన్ ఇంతేనా! మరి దారుణం కదా 

Apr 21, 2026

 

 

-శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న రాకా 
-ఆసక్తి కరంగా మారిన రెమ్యునరేషన్ డీటెయిల్స్ 
-అట్లీ కి ఎంత! 
-అల్లు అర్జున్ కి ఎంత! 

ఇండియా వ్యాప్తంగా ఏ ఇద్దరు సినీ లవర్స్ కలిసినా కంపల్ సరి వాళ్ళ మధ్య రాకా(Raaka)డిస్కర్షన్ ఉండటం  కామన్. మరి అక్కడ ఉంది ఎవరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్లాప్స్ అంటే గిట్టని పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ(Atlee). పైగా అల్లు అర్జున్ బర్త్ డే రోజు రిలీజైన టీజర్ కూడా వాళ్ళ డిస్కర్షన్ స్థాయిని ఇంకొంచం పెంచింది. ఇప్పుడు వాళ్ళందరిని నాకు స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది అనే రీతిలో ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

సినిమా అన్నాక రెమ్యునరేషన్ కామనే కదండీ. ఈ క్రమంలోనే అట్లీ 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడనేది టాక్. ఈ న్యూస్ లో నిజమెంత ఉందో తెలియదు గాని వంద కోట్లు అందుకున్నాడంటే ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. అట్లీ ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆ న్యూస్ ని నమ్మడంలో తప్పులేదని అనిపిస్తుంది. ప్రీవియస్ అట్లీ హిట్  మూవీ జవాన్ సైతం నన్ను ఎగ్జామ్ ఫుల్ గా తీసుకోండి బాస్ అని నొక్కి మరి చెప్తుంది. మరి ఎలాగూ అట్లీ రెమ్యునరేషన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి అల్లు అర్జున్ తో పాటు మిగతా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ కి ఒకసారి చూద్దాం.


also read: Raja Shivaji: జెనీలియా కన్నీళ్లు.. రితీష్ ఎమోషనల్ 

అల్లు అర్జున్ 175 నుంచి 180 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 15 శాతం వాటా తీసుకోబోతున్నట్టుగా వినిపిస్తుంటే దీపిక పదుకునే  20 నుంచి 25 కోట్లు వరకు తీసుకోబోతుందనేది సోషల్ మీడియా టాక్.  'రాకా'ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kalanithi Maran)నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com