ఉల్లిపూల సీరే గట్టి: థియేటర్లకు ఊపేసే తెలంగాణ ఫోక్ సాంగ్ వచ్చేసింది.!
Nov 28, 2026 3:41PM

ప్రియదర్శి హీరోగా బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న సినిమా 'ఇడుపు కాయితం'. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా 'ఇడుపు కాయితం' సినిమాను వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. డిసెంబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది.
సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా 'ఉల్లిపూల..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట మొదలవగానే ‘ఉల్లిపూల సీరే గట్టి.. ఉత్తరాది సెరువే దాటి’ అనే పదాలు వినిపిస్తాయి. భర్తను ఉద్దేశించి తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాడుతున్నట్టుగా సాగిన ఈ పాటకు అభినయ శ్రీనివాస్ అందించిన సాహిత్యం ఎంతో సహజంగా ఉంది.
సురేష్ బొబ్బిలి ఈ పాటకు జానపద టచ్ ఉన్న మెలోడీని అందించారు. సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆధునిక సంగీతపు హంగులతో కలపడంతో పాటకు మంచి వినసొంపైన ఫీల్ వచ్చింది.

హెనాగ్రేస్ గాత్రం కూడా పాటలోని అమ్మాయి భావాలకు సరిపోయింది. సాహిత్యంలో ఉన్న తెలంగాణ యాసను, ప్రేమలోని సరదాను ఆమె గాత్రం మరింత సహజంగా వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి: 'పచ్చని చిలుకలు తోడుంటే' పాట వెనుక ఇంత అర్థం ఉందా.!
మరోవైపు లిరికల్ వీడియోలో ప్రియదర్శి, నాగ దుర్గ కనిపించే సన్నివేశాలు, గ్రామీణ వాతావరణం, రంగురంగుల దృశ్యాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటలోని ఉత్సాహాన్ని పెంచింది.
మొత్తానికి ‘ఉల్లిపూల’ పాట ప్రత్యేకత ఏంటంటే.. ప్రేమను చాలా సహజంగా, మనకు తెలిసిన పల్లెటూరి జీవితంలో భాగంగా చూపించడం. పెద్ద పెద్ద మాటలు లేకుండానే ఒక అమ్మాయి మనసులోని ప్రేమను, అల్లరిని, ఆప్యాయతను ఈ పాటలో వినిపించారు. అందుకే ఈ పాటలోని తెలంగాణ నేటివిటీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చవచ్చు:
కాకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. విశ్వంభర పరిస్థితి ఏంటి.?
ఇరుముడి 100 డేస్ గిఫ్ట్.. రవితేజ ఫ్యాన్స్‌కు మర్చిపోలేని ట్రీట్.!
[Ullipoola Song, Idupu Kayitham, Priyadarshi, Naga Durga, Suresh Bobbili]




