Home

»

Latest News

ఆకాశంలో ఒక తార స్పెషల్ ఏంటి!

Nov 16, 2026 9:25AM

కొన్ని మూవీస్ అంతే రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించేస్తాయి. అలాంటి  ఒక చిత్రమే 'ఆకాశంలో ఒక తార'. ఆల్రెడీ చాలా రోజుల నుంచి థియేటర్స్ లో ట్రైలర్ రూపంలో కూడా రన్ అవుతుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మూవీపై క్యూరియాసిటీ అంతకి అంత పెరిగిందని కూడా చెప్పవచ్చు.  ఇక నిన్న జరిగిన ఈవెంట్ కి ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ రావడంతో టాక్ ఆఫ్ ది డే గా కూడా నిలిచింది 


నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "ఒక ఆర్మీలా నా వెనుక నిలబడి నన్ను ఎప్పుడూ ప్రేమించే నా అభిమానులందరికీ ధన్యవాదాలు. నాకు దుల్కర్ సల్మాన్ అంటే వ్యక్తిగతంగా ఎంతో ఇష్టం.

మలయాళం, తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ విభిన్నమైన, అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ 'ఆకాశంలో ఒక తార' ఆయన కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచిపోతుంది" .మూవీ సూపర్ డూపర్ హిట్ కాబోతుందని అల్లు అర్జున్  కొనియాడాడు.

 

అంతేకాకుండా తొలి సారి సెల్యులాయిడ్ పై   పరిచయమవుతున్న సాత్విక వీరవల్లికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైతం ఈ చిత్రంలోని లీడ్ కాస్ట్ మరియు టెక్నికల్ వాల్యూస్ గురించి చెబుతూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.   

 

దుల్కర్ సల్మాన్ 'కృష్ణ' అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తుండగా కల్పన గా సాత్విక వీరవల్లి చేస్తుంది. కేవలం ఒక సాధారణ ప్రేమకథలా కాకుండా, మారుమూల గ్రామానికి చెందిన ఒక యువతి తన కలలను సాకారం చేసుకుంటూ అంతరిక్షం వైపు అడుగులు వేసే అద్భుతమైన ప్రయాణమే ఈ చిత్ర ప్రధానాంశం. ఇలాంటి డిఫరెంట్ అండ్ ఎమోషనల్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా కథాబలం చూసి టాలీవుడ్ ప్రముఖులే ఆశ్చర్యపోతున్నారు.

 నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, అందించిన ప్రతి పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ విజువల్స్, కె.ఎల్. ప్రవీణ్ ఎడిటింగ్ పనులు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని ట్రైలర్ నిరూపించింది.

నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా అద్భుతమైన అనుభూతిని పంచడం ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ సాధినేని దర్శకత్వంలో  గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మించడం ఆకాశంలో ఒక తారకి అదనపు బలం. 

మీకు నచ్చవచ్చు: గిరిబాబు గారి మరణంతో బయటకి వచ్చిన నిజం ఇదే! 
మీకు నచ్చవచ్చు:ఛార్మిపై ప్రముఖ సీనియర్ నటి వ్యాఖ్యలు వైరల్!

 

[Allu Arjun, Aakasamlo Oka Tara, Dulquer Salmaan, Satvika Veeravalli, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com