Home

»

Latest News

గిరిబాబు గారి మరణంతో: అందరకి తెలిసిన సత్యం ఏంటంటే!

Nov 14, 2026 6:33PM

 

 

గిరిబాబు.. తెలుగు సినిమా ప్రేమికుల నోటి వెంట సెల్యులాయిడ్ పై ఆయన పలికిన కామెడీ  డైలాగులు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఎనీ క్యారక్టర్ తీసుకోండి మెస్మరైజ్ చేయడంలో ఆరి తేరిన దిగ్గజ నటుడు. ఈ రోజు సాయంత్రం గిరిబాబుగారు సినిమాని వీడి అనంత లోకాలకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన పార్థివ దేహం అభిమానులు, ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్ ఫిలిం నగర్ ఛాంబర్ లో ఉంచారు.

దీంతో అభిమానులు,సాటి సినీ నటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రజలు గిరిబాబు గారి పార్థివ దేహాన్ని  చూడటానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీన్ని బట్టి అర్ధమవుతున్న నిజం ఏంటంటే సినిమా నటులకి, సినిమా వాళ్ళకి  ఈ సమాజం ఎంతో విలువ ఇస్తుందని. 

1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్నతనం నుంచే సినిమాలపై ఉన్న విపరీతమైన ఆసక్తితో ఆయన ఊళ్లోని టూరింగ్ టాకీస్‌లోనే ఎక్కువ సమయం గడిపేవారు.

ఆ రోజుల్లో అందరూ ఆయన్ను "సినిమా పిచ్చోడు" అని పిలిచేవారట. నాటకాలపై మక్కువతో సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించి నటనలో మెలకువలు నేర్చుకున్న ఆయన, సినీ రంగంలో అడుగుపెట్టే క్రమంలో తొలిరోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఛార్మిపై శంకరాభరణం మంజు భార్గవి వ్యాఖ్యలు వైరల్:ఛార్మికి అందులోనే ఎక్కువ మార్కులు! 
 

మొదటగా అనుకున్న మూడు సినిమాలు వివిధ కారణాల వల్ల ఆగిపోయినప్పటికీ, వెనకడుగు వేయకుండా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించి 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా తెరపైకి వచ్చారు.   తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో గిరిబాబు వైవిధ్యభూమితమైన పాత్రలతో మెప్పించారు. సుమారు 100 సినిమాల్లో హీరోగా, 300 సినిమాలకు పైగా విలన్‌గా నటించి ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు హాస్యనటుడిగా విభిన్న కోణాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ పంచుకున్నారు.

కేవలం నటుడిగానే కాకుండా జయభేరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన', 'మెరుపు దాడి', 'పసుపు కుంకుమ' వంటి చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్‌లో తన బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు.

 

మీకు నచ్చవచ్చు: మహేష్ బాబు న్యూ ఏజ్ పిక్ వైరల్.. పక్కనున్న హీరోయిన్ ఎవరు!  
మీకు నచ్చవచ్చు:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో: హిట్ పక్కనా!


[Giribabu, Raghubabu, Film  Chamber, Tollywood, Chiranjeevi]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com