Home

»

Latest News

సెన్సార్ వాళ్లనే భయపెట్టిన మూవీ.. అప్పుడే ఓటీటీలోకి ఆ హారర్ థ్రిల్లర్‌.!

Nov 16, 2026 9:51AM

హారర్ సినిమాలు అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులే భయపడిపోయారనే ప్రచారం జరిగితే ఆ మూవీపై అంచనాలు మరింత పెరుగుతాయి. అలా విడుదలకు ముందు ఆసక్తి రేకెత్తించిన హారర్ థ్రిల్లర్ ‘418’. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 19 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన హారర్ మూవీ లవర్స్ ఇంట్లోనే చూసే అవకాశం దక్కనుంది.

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్‌లో నిర్మించిన చిత్రమిది. చైత్ర జె. ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సైన్స్‌కు, మూఢనమ్మకాలకు మధ్య జరిగే సంఘర్షణను హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఎన్నో వాయిదాల తర్వాత అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కర్ణాటక తీర ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న మెడికల్ కాలేజీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆ కాలేజీ బాయ్స్ హాస్టల్ గతంలో మానసిక వైద్యశాలగా ఉండేది. అందులో మహిళలు అడుగుపెట్టకూడదనే ఓ భయంకరమైన నిబంధన ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మహిళ ఆ భవనంలోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రారనే భయం విద్యార్థుల్లో ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?

వివేక్ శంకర్ అనే మెడికల్ విద్యార్థి ఆ హాస్టల్‌లోని 417వ గదిలో చేరతాడు. అయితే పక్కనే ఉన్న 418వ గది మాత్రం గత 15 ఏళ్లుగా తాళం వేసి ఉంటుంది. ఆ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని అతనికి హెచ్చరికలు అందుతాయి. కానీ దెయ్యాలు, మూఢనమ్మకాలను నమ్మని వివేక్ స్నేహితుడు రోహిత్.. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. మరోవైపు సైషా కూడా 418వ గది మిస్టరీని ఛేదించాలని సవాల్ చేస్తుంది. అసలు ఆ గదిలో ఏముంది? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేదే సినిమా ఆసక్తికరమైన అంశం.

విడుదలకు ముందు ఈ సినిమా హారర్ సన్నివేశాల తీవ్రత కారణంగా సెన్సార్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొందనే వార్తలు వచ్చాయి. రివైజింగ్ కమిటీకి వెళ్లిన తర్వాత ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించింది. దీంతో సినిమా ఎంత భయంకరంగా ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. అయితే థియేటర్లలో మాత్రం కథనం విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది.మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీకు నచ్చవచ్చు: 
ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్‌ మారతారా.?
మరో సర్‌ప్రైజ్.. బోయపాటితో అల్లు అర్జున్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌.!

 

 

 

[418 OTT Release, Netflix, Prashanth Neel, Mythri Movie Makers, Kirtan Nadagouda]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com