ప్రముఖ హీరోయిన్ పెళ్లి బాధ్యత భుజాన వేసుకున్న అల్లు అరవింద్: అప్రిషియేట్ చేస్తున్న ఫ్యాన్స్!
Nov 27, 2026 11:29AM
.webp)
కథని ముందుగానే స్కాన్ చేసి, హీరో, హీరోయిన్స్ దగ్గరనుంచి ఎలాంటి టీంతో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలో తెలిసిన అతి పెద్ద మాస్టర్ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లి సినిమాని సూపర్ హిట్ చెయ్యడంలో కూడా లెక్కలేనన్ని సినీ పిహెచ్ డి లు చేసాడు.ఇప్పుడు ఈ లెజండ్రీ ప్రొడ్యూసర్ 'ఆకాశంలో ఒక తార' తో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ రుహాణి శర్మ పెళ్లి బాధ్యతలని తన భుజానపై వేసుకున్నాడు.
హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటూ సలహా!
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా వచ్చిన 'ఆకాశంలో ఒక తార' సినిమా సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికపై ఉన్న రుహానీ శర్మని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతు రుహానీ కూడా హైదరాబాద్‌లోనే మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చుగా అంటూ సరదాగా సలహా ఇచ్చారు. దీనికి రుహానీ 'ఇట్స్ ఎ బ్లెస్సింగ్' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. వెంటనే అల్లు అరవింద్.. అంటే నీ మనసులో ఇప్పటికే ఎవరైనా ఉన్నారా? అంటూ చమత్కరించడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

లావణ్య త్రిపాఠి విషయంలో నిజమైన అల్లు అరవింద్ మాట!
గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా అల్లు అరవింద్ ఇలాంటి సలహానే ఇచ్చారు. హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని సూచించారు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇప్పుడు రుహానీ విషయంలోనూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇది కూడా చదవండి: శ్రీకాళహస్తిలో నాగచైతన్య.. వృషకర్మ హిట్టు కాబోతుందా!
రుహానీ పెళ్లిపై మొదలైన చర్చ!
'ఆకాశంలో ఒక తార' లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన బిజిలీ అనే క్యారక్టర్ లో రుహానీ శర్మ కనపరిచిన నటనకి మంచి ప్రశంసలు వస్తున్నాయి. మరి అల్లు అరవింద్ చెప్పినట్లుగా రుహానీ కూడా హైదరాబాద్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందా? అనేది చూడాలి.

మీకు నచ్చవచ్చు
బాలకృష్ణకి అదనపు బాధ్యతలు అప్పగించిన ఏపి ప్రభుత్వం!
[Allu Aravind, Ruhani Sharma, Akasamlo Oka Tara, Tollywood]



