బెనిఫిట్ షో పడకపోవడానికి ప్రధాన కారణం ఇదే
on Dec 4, 2025

-బెనిఫిట్ షో ఎందుకు పడలేదు
-అభిమానుల రియాక్షన్
-ఏం పర్లేదు
-రేపు శివతాండవం
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అఖండ 2(Akhanda 2). ఆల్రెడీ ప్రచార చిత్రాలతో పాటు,మూవీ క్రిటిక్స్ లో ప్యూర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ కావడంతో సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య చేసే శివ తాండవం ఏ స్థాయిలో ఉంటుందో చూడటానికి అందరు ప్రీమియర్స్ చూడటానికి థియేటర్స్ కి వెళ్లారు. కానీ ఈ రోజు ప్రీమియర్స్ ప్రదర్శించడం లేదని తెలియడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ షాక్ కి గురయ్యారు.
ఈ క్రమంలో ప్రీమియర్స్ పడకపోవడానికి ప్రధాన కారణం టెక్నికల్ ఇష్యు కారణం అని తెలుస్తుంది. రేపు అఖండ 2 ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఈ మేరకు చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.ఇక బెనిఫిట్ షోస్ ప్రదర్శించకపోవడం పై అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఈ రోజు బెనిఫిట్ షో పడకపోయినా బాలకృష చేసే శివతాండవం శుక్రవారం నాడు స్క్రీన్ పై ఒక రేంజ్ లో చూస్తామని సినిమా సూపర్ డూపర్ హిట్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే!
అఖండ 2 ప్రీమియర్స్ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు బెనిఫిట్ షో కి కూడా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



