బాలయ్య అభిమానుల ఆందోళన.. రిలీజ్ పై నిర్మాతలు చెప్పింది ఇదే
on Dec 4, 2025

-ఫ్యాన్స్ ఆందోళన
-ఏం జరగబోతుంది
-ఎందుకు ఎలా జరిగింది
-నిర్మాతలు ఏమంటున్నారు
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2' (Akhanda 2)తో బాలయ్య(Balakrishna)చేసే శివ తాండవం చూడటానికి అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తు వస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఈ రోజు ప్రదరించబోయే ప్రీమియర్స్ తో ఫలించబోతుండటంతో సుమారు మూడు రోజుల నుంచే థియేటర్స్ ని ముస్తాబు చేసి 'జై బాలయ్య' నినాదాలతో థియేటర్స్ పరిసర ప్రాంగణం మొత్తాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. కానీ టెక్నీకల్ ఇష్యు వల్ల ఈ రోజు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం లేకపోవడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
దీంతో ఏపి, తెలంగాణ కి సంబంధించిన చాలా ఏరియాల్లో అభిమానులు ఆందోళనకి దిగినట్టుగా తెలుస్తుంది. సదరు ఆందోళనకి సంబంధించిన విజువల్స్ కూడా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక అఖండ 2 లేట్ పై మేకర్స్ స్పందిస్తు తదుపరి కొద్ది గంటల్లో సమస్యలని పరిష్కరించగలం. ఓవర్సీస్ షో లకి ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇండియాలో షో లు రేపటి నుండి ప్రారంభమవుతాయని తెలియజేశారు. దీంతో బాలయ్య శివ తాండవం రేపట్నుంచి ప్రారంభం కానుంది.
also read: బెనిఫిట్ షో పడకపోవడానికి ప్రధాన కారణం ఇదే
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



