
అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటమే ఈ పోస్ట్ పోన్ కి కారణమని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్ మాత్రం మరోలా ఉంది.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్‌కి రైటర్‌గా 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. డైరెక్టర్‌గా ఏ రేంజ్ సినిమా ఇస్తారోనని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఇన్‌సైడ్ టాక్ కూడా అలాగే ఉంది.
‘ఆదర్శ కుటుంబం’ అవుట్ పుట్ చూసుకొని మూవీ టీమ్ సంతృప్తి చెందలేదట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో డిజప్పాయింట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే మూవీ రిలీజ్ ని ప్రజెంట్ హోల్డ్ లో పెట్టారని ప్రచారం జరుగుతోంది.

సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలా? లేక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించి, ఉన్న కంటెంట్ నే కాస్త బెటర్ అవుట్ పుట్ గా మార్చాలా? అనే విషయంలో మూవీ టీమ్ తర్జనభర్జనలు పడుతుందట.
ప్రస్తుతం వెంకటేష్ ఫారెన్ లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత వెంకటేష్, సురేష్ బాబుతో చర్చించి.. రీషూట్ కి వెళ్ళాలా? లేక ఎడిట్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఉన్న కంటెంట్ నే బెటర్ గా మార్చాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారట. వెంకటేష్ చెప్పే దానిని బట్టే రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలలో 'ఆదర్శ కుటుంబం' విడుదల కష్టమే అంటున్నారు.
ఇది కూడా చదవండి: నిల్ బజ్‌తో బరిలోకి శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’కి ఇదే పెద్ద మైనస్.?
[Aadarsha Kutumbam Inside Talk, Aadarsha Kutumbam Postponed, Aadarsha Kutumbam House No 47, Victory Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Nara Rohith, Telugu Film News]






