
సంజయ్ దత్.. ఈ కట్ అవుట్ కి ఉన్న పేరు ఎంతో ప్రత్యేకం. మూడు దశాబ్దాల క్రితమే గుంటూరు లాంటి ఏరియాలో అభిమాన సంఘాలు వెలిసి థియేటర్స్ ని బ్యానర్స్ తో నింపేసాయంటే సంజయ్ దత్ చరిష్మా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ ని ఫాలో అయిన యూత్ కైతే లెక్కే లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మురిసిపోయేలా తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో ఫ్యాన్స్, ప్రేక్షకులు మురిసిపోయేలా చేస్తున్నాడు.
సంజయ్ దత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. నటుడు శేఖర్ సుమన్ హోస్ట్ గా ఉన్న 'శేఖర్ టునైట్' అనే టాక్ షోలో పాల్గొన్న సంజయ్ దత్ 'దేశంలో ఇకపై తనకు శాంతి కనిపించడం లేదనే కామెంట్స్ చేసాడు. దీంతో ఆ కామెంట్స్ పలు విమర్శలకి దారితీశాయి. ఈ వివాదంపై సంజయ్ దత్ రీసెంట్ గా ఒక వీడియో ద్వారా స్పష్టతనిచ్చారు.ఆయన మాట్లాడుతు' షోలో నేను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా స్క్రిప్టెడ్ షోలో భాగంగానే వచ్చాయి. వాటిని నా వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించవద్దు. నా మాటలు ఎవరినైన ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలని వాటి వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చేతులు జోడించి కోరారు.
పూర్తిగా చదవండి: 'ఎపిక్' ఓటిటి డేట్ వచ్చేసింది: మరి జెన్ జీ బ్యాచ్ ఏం చేస్తుందో!

ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తూ' షోలో మున్నాభాయ్ పాత్రలో భాగంగా రాజకీయ వ్యంగ్య సంభాషణల్లో భాగంగానే గాంధీజీ మూడు కోతుల ప్రస్తావన తెచ్చానని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తుంటే సరిదిద్దడానికి నాల్గవ కోతి ఎక్కడంటూ తాను చేసిన వ్యాఖ్యలు కేవలం వినోదం, వ్యంగ్యం కోసం మాత్రమేనని వివరించారు. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తన శ్రేయోభిలాషుల నమ్మకాన్ని తాను ఎప్పుడూ వమ్ము చేయనని తెలిపారు. మరోవైపు నటుడిగా సంజయ్ దత్ చివరిసారిగా మే నెలలో విడుదలైన ‘ఆఖ్రీ సవాల్’ రాజకీయ డ్రామా చిత్రంలో కనిపించారు. త్వరలో ఆయన ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రంలో బల్లు క్యారక్టర్ లో అలరించనున్నారు.
[Sanjay Dutt Clarifies No Peace In India Remark, Sanjay Dutt, Shekhar Tonite, Sanjay Dutt controversy, Sanjay Dutt clarification, Munna Bhai Gandhigiri,TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]






