పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి!..ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్
on Jan 21, 2026

-ఆ హీరోయిన్ మాటల వెనక ఉన్న అంత్యరం ఏంటి!
-పవన్ కి అంత శక్తి ఉందా
-డౌన్ టూ ఎర్త్ మళ్ళీ ఖాయమా
'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అనే పేరుకి ఉన్న పవర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినీ రంగంలో ఎలా అయితే తన మేనరిజమ్స్, స్టైల్, డాన్స్, యాక్టింగ్ తో డౌన్ నుంచి స్టార్ గా ఎదిగారో రాజకీయాల్లోను అదే విధంగా డౌన్ నుంచి ఎదిగి ఆంధప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి. మరి అంతలా షేక్ చేస్తున్న న్యూస్ ఏంటో చూద్దాం.
నిధి అగర్వాల్(Niddhi Agerwal)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'పవన్ కళ్యాణ్ గారు సింహం లాంటి వ్యక్తి . ఒంటరిగా నిలబడి పోరాడగల దైర్యం ఆయన సొంతం.ప్రజల కోసం తన సిద్ధాంతాల కోసం రాజీపడకండా నిలబడే వ్యక్తిత్వం కూడా ఉంది. అలాంటి లక్షణాలు ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో ఆయన దేశ ప్రధాని అయితే నాకు ఏ మాత్రం ఆశ్చర్యం ఉండదు. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని కూడా ప్రభావితం చెయ్యగలరు అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.
Also read: Dhurandhar 2: ఈ రూమర్ నిజమైతే ఆపడం ఎవరి తరం కాదు
ప్రస్తుతం బెస్సి గా రాజా సాబ్ తో కలిసి సందడి చేస్తున్న నిధి అగర్వాల్ గత ఏడాది పవన్ కళ్యాణ్ తో కలిసి పంచమి అనే రాజనర్తకి గా హరిహర వీరమల్లుతో మెప్పించిన విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



