స్విట్జర్లాండ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి.. ఏం మాట్లాడుకున్నారో తెలుసా?
on Jan 21, 2026

దావోస్‌లో 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026' సదస్సు
హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
చిరంజీవికి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం
'మన శంకర వరప్రసాద్ గారు' చూశానన్న సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి పలు వేదికలపై సందడి చేస్తున్నారు. తాజాగా స్విట్జర్లాండ్ వేదికగా వీరి అనుబంధం మరోసారి బయటపడింది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026' సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే చిరంజీవి కూడా కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్ళారు. చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ లో ఉన్నారని తెలుసుకున్న రేవంత్ రెడ్డి, ఆయన్ని సదస్సుకు ఆహ్వానించారు.

Also Read: ప్రభాస్ 'స్పిరిట్'లో మరో టాలీవుడ్ స్టార్!
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.
స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న రేవంత్ రెడ్డి, చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులతో కలిసి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



