Dragon: మళ్ళీ ఆగిపోయిన డ్రాగన్ షూటింగ్.. ఎన్టీఆర్ వల్లేనా?
on Jan 21, 2026

డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్!
ఎన్టీఆర్ కి ఏమైంది?
మళ్ళీ షూటింగ్ ఎప్పుడు?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఫిల్మ్ 'డ్రాగన్' (Dragon). పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దాంతో ఈ ఏడాది విడుదల కావాల్సిన సినిమా కాస్తా.. వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో డ్రాగన్ షూటింగ్ కి మరోసారి బ్రేక్ పడిందన్న వార్త సంచలనంగా మారింది. దీనికి కారణం ఎన్టీఆర్ అని తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'డ్రాగన్' మూవీ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ ఎక్కువగా రాత్రి పూట జరుగుతుందని వినికిడి. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటంతో.. ఎన్టీఆర్ తీవ్ర జలుబుకు, జ్వరానికి గురయ్యాడట. దీంతో షూటింగ్ కి బ్రేక్ పడినట్లు సమాచారం. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ ఈ షెడ్యూల్ రీ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. కాగా, ఈ షెడ్యూల్ తర్వాత విదేశాల్లోనూ ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. మూవీ 2027 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు'పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



