
ప్రేమకి సరికొత్త నిర్వచనంతో పాటు తొలి సారి యువతీ యువకుల మధ్య ఏర్పడిన ప్రేమ
తాలూకు పొరలు చచ్చే వరకు మనసులో నుంచి వెళ్ళవని, ప్రేమ అవతలి వారి సంతోషాన్ని కూడా కోరుకుంటుందని చెప్పిన మూవీ 96 . త్రిష, విజయ్ సేతుపతి నుంచి తమిళంలో రాగా తెలుగులో జాను పేరుతో సమంత, శర్వానంద్ ప్రేక్షకులకి అందించారు. అయితే 96 బాగుందనే టాక్ రావడంతో జాను గా రాక ముందే చాలా మంది తెలుగు ప్రేమికుల తమిళంలోచూసేసారు. అందుకే 'సౌత్ ఇండియన్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే టాగ్ లైన్ ని ఆభరణంగా ఉంచుకుంది.
2018 అక్టోబర్ 4 న రిలీజవ్వగా రీసెంట్ గా 96 తమిళనాట నిన్న (అక్టోబర్ 9 ) రీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో జాను క్యారక్టర్ కి సంబంధించి గతంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా జాను కోసం మొదట జ్యోతికను సంప్రదించారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై తాజాగా చిత్ర దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'జాను కోసం నా మొదటి, ఏకైక ఛాయిస్ ఎప్పుడూ త్రిష గారే. స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే నేను నటీనటులను ఊహించుకుంటాను. అలా రాస్తున్నప్పుడే నా మనసులో జాను గా కోసం త్రిష రూపమే మెదిలింది.
ఇది కూడా చదవండి: 'రణబాలి’కి టికెట్ ధరలే బిగ్ బూస్ట్.. బాక్సాఫీస్‌పై విజయ్ దేవరకొండ ఆశలు!

2015 డిసెంబర్‌లో వచ్చిన చెన్నై భీకర వరదల సమయంలో 96 కథ రాశాను. అప్పట్లో త్రిష డేట్స్ సర్దుబాటు కావడం కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ, ఆ తర్వాత అన్నీ కుదిరి విజయ్ సేతుపతి సరసన త్రిష నటించేలా షెడ్యూల్స్ అడ్జస్ట్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ప్రతీ ఏటా సినిమా వార్షికోత్సవం సందర్భంగా రెండేళ్లు, మూడేళ్లు లేదా ఎనిమిదేళ్లు పూర్తయినా కూడా అభిమానులు ఇచ్చే రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. 96 ని కేవలం ఒక సినిమాగా కాకుండా ప్రేక్షకులు తమ జీవితంలో ఒక భాగంగాచూస్తున్నారు. ఆ ప్రేమ తన ఊహకందనిదిగా ఉంది. 2002 వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో వచ్చిన ఐడియాతో కథ రాస్తున్నానని ప్రేమ్ కుమార్ తెలిపాడు . ప్రేమ్ కుమార్ ప్రీవియస్ మూవీ సత్యం సుందరం.. భారీ బడ్జెట్ కి దూరంగా సమాజంలోని క్యారెక్టర్స్, వాటి మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్స్, భావోద్వేగాల ఆధారంగా మాత్రమే సినిమాలు తెరకెక్కించడంలో ప్రేమ్ కుమార్ స్పెషలిస్ట్.
[96 Director About 96 Movie Jaanu First Choice Clarification, C Prem Kumar About 96 movie, Jaanu character, Trisha Krishnan, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






