
విజయ్ దేవరకొండ హిట్ అందుకొని చాలా యేండ్లు అవుతుంది. కానీ క్రేజ్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బాక్స్ ఆఫీస్ పై నా జెండా పాతడం పక్కా అంటూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రణబాలి’ తో వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి లోకేష్ సైతం 'రణబాలి' ట్రైలర్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడంటే 'రణబాలి’ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
అక్టోబర్ 16 రిలీజ్ డేట్ కావడంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ‘రణబాలి’ సినిమా టికెట్ ధరల పెంపు గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద హీరోల పాన్ ఇండియా సినిమాలకు మొదటి వారం లేదా ప్రీమియర్ షోల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రత్యేక ధరల పెంపు కోరడం టాలీవుడ్‌లో రివాజుగా మారింది. కానీ, ‘రణబాలి’ చిత్ర యూనిట్ ఈ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుని అభిమానులకు అదిరిపోయే గుడ్ నూస్ అందించింది. సినిమా టికెట్ ధరల పెంపుపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఎలాంటి నిజం లేదని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: అలియాస్ రుక్మిణి: ఈ సుందరినేనా!

ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తాము ఎలాంటి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలను ఆశ్రయించలేదని, సినిమాను కేవలం స్టాండర్డ్ (సాధారణ) ధరలకే విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల అటు సినీ వర్గాలలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సులభంగా ఆస్వాదించవచ్చని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ ‘రణబాలి’ క్యారక్టర్ లో కనిపించనుండగా, ఆయన సరసన జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటీష్ క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. భారీ తారాగణం, ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.
Ranabaali Ticket Prices Update, Vijay Deverakonda, Ranabaali movie, Ranabaali ticket prices, Rashmika Mandanna, Mythri Movie Makers, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






