
కొన్ని న్యూస్ ఇచ్చే కిక్ డల్ నెస్ మొత్తాన్ని పోగొట్టడమే కాకుండా ఎక్స్ పైరీ డేట్ లేని 'రీ ఫ్రెష్' ని అందిస్తూ ఉంటాయి. అలాంటి న్యూసే ఒక తెలుగు హీరో పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నాడని. మరి ఆ న్యూస్ చూసి మనం కూడా రిఫ్రెష్ అవుదాం.
సెల్యులాయిడ్ పై కోట్లాది మంది అభిమానులని తన నటనతో, మాస్ ఇమేజ్‌తో కట్టిపడేసిన ఒక అగ్ర కథానాయకుడు త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారం సాధారణ నెటిజన్ల నుంచే కాకుండా రాజకీయ విశ్లేషకుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. దాదాపు 100 కంటే ఎక్కువ అధికారిక అభిమాన సంఘాలు ఉన్న ఈ స్టార్ హీరో, తన తరువాతి అడుగును ప్రజాసేవ వైపు వేయడానికి సిద్ధమవుతున్నారని సినీ, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఇంటర్నెట్లో జరిగిన కొన్ని అంతర్గత సర్వేల ప్రకారం దాదాపు 80 శాతానికి పైగా యువత సినీ తారలు రాజకీయాల్లోకి రావడం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక సమీకరణలు మారుతున్న తరుణంలో, కొత్త ఆలోచనలు మరియు పారదర్శకమైన నాయకత్వాన్ని ఆశిస్తున్న ప్రజలకు ఈ హీరో సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: క్షమించండి: నిజం ఒప్పుకున్న రాముడిపై ప్రసంశలు!
అయితే, ఇప్పటివరకు ఈ ప్రచారంపై సదరు హీరోగానీ, ఆయన సన్నిహిత వర్గాలు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం త్వరలో రాబోయే ఆయన కొత్త సినిమా పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించే దిశగా వేస్తున్న రహస్య వ్యూహమా అనేది ఇంకా ఉత్కంఠగానే ఉంది. అయినప్పటికీ, పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం ఈ స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీపై చర్చలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రస్థుతానికి అయితే ఆ అగ్ర హీరో పొలిటికల్ ఎంట్రీ న్యూస్ యొక్క స్టేటస్ జస్ట్ రూమర్.
[Tollywood Hero New Political Party Rumor, Tollywood Hero Political Entry, Telugu Actor New Party Rumors, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





